లేచిన వెంటనే కాసిన్ని కాచిన వేడినీరు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గోరు వెచ్చని వేడినీరు తీసుకోవడం వలన జీవనక్రియలు మెరుగుపడతాయి. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అయితే, ఉదయాన్నె పరగడుపున ఇతర వేడి పానియాలు తీసుకుంటే మంచిదా కాదా అంటే కాదనే అంటున్నారు నిపుణులు. ఉదయాన్నే టీతో రోజును ప్రారంభిస్తే దాని వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Health: లేచిన వెంటనే కాసిన్ని కాచిన వేడినీరు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గోరు వెచ్చని వేడినీరు తీసుకోవడం వలన జీవనక్రియలు మెరుగుపడతాయి. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అయితే, ఉదయాన్నె పరగడుపున ఇతర వేడి పానియాలు తీసుకుంటే మంచిదా కాదా అంటే కాదనే అంటున్నారు నిపుణులు. ఉదయాన్నే టీతో రోజును ప్రారంభిస్తే దాని వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదయాన్నె గోరు వెచ్చని నీరు తీసుకోవడానికి, టీ తీసుకోవడానికి చాలా తేడా ఉందని నిపుణులు చెబుతున్నారు. టీ, కాఫీ తదితర పానియాల్లో కెఫిన్ ఉంటుందని, ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన స్టమక్ ఇరిటేషన్ అవుతుందని, అంతేకాకుండా అన్నవాహిక, కడుపులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా కొంతమంది నిద్రలేవగానే టీ తాగకుంటే తలనొప్పి వస్తుందని అంటుంటారు. కానీ, అది నిజం కాదని, టీ తాగడం వలనే తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పరగడుపున టీ తీసుకోవడం వలన కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా టీలో ఉండే టానిన్, కెఫిన్లు పాలీఫెనాల్స్ ఉండటం వలన ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరం ఆహారం నుంచి ఇనుము వంటి పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.