Difficulties to postpone mentalities: వాయిదా వేస్తే… చెల్లించక తప్పదు భారీ మూల్యం
Difficulties to postpone mentalities: ఏదైనా ఒక పనిని చేయాల్సి వచ్చినపుడు చాలా మంది ఇంకా టైం ఉందికదా రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని వాయిదాలు వేస్తుంటారు. తీరా చివరికి వచ్చే సరికి హడావుడి పడుతూ కంగారుపడిపోతారు. ఈజీగా చేయవలసిన పనిని కూడా నాసీరకంగా చేసి అభాసుపాలవుతారు. లేదా, చేతికి రావలసిన దానిని వదులుకుంటారు లేదా వచ్చే ఉద్యోగాన్ని కూడా కోల్పోతారు. కాంపిటీషన్ ప్రపంచంలో వాయిదా పద్దతులు ఏ మాత్రం పనికిరావు. వాయిదాలు వేయడం వలన జీవితం చాలా కోల్పోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక విషయాన్ని వాయిదా వేయడం మొదలుపెట్టామంటే, ప్రతి విషయంలోనూ అదేవిధంగా చేయడం అలవాటుగా మారుతుంది. ఈ పద్ధతిని అలవాటు చేసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాయిదా పద్దతుల నుండి బయటపడాలి అంటే, చేస్తున్న పనిని డివైడ్ చేసుకోవాలి. ఏది ఏ సమయంలో చేయాలో, ఎలా చేయాలో ముందుగా నిర్ణయించుకొని, కష్టమైనా నష్టమైనా సరే ఆ సమయం ప్రకారం చేయడం అలవాటు చేసుకోవడం చాలా మంచింది. ఒకసారి పనిని సక్రమంగా చేయడం అలవాటు చేసుకుంటే, ఏ పనినైనా అదేవిధంగా వాయిదా పద్దతుంది దేనికైనా అని అలోచించకుండా చేసుకుంటూ పోతారు. తద్వారా ప్రతి విషయంపై కూడా పాజిటివ్ ఆలోచనలు మొదలౌతాయి. ఇవే జీవితాన్ని విజయాలవైపు నడిపిస్తాయి. ఇక, వాయిదా మనస్తత్వం ఉండేవారి ఆలోచనలు ఎప్పుడూ నెగెటీవ్ తీరాలపైపు లాగబడుతుంటాయి.