Cold water bath: చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా… గుండె జాగ్రత్త…
Cold water bath: చలికాలం సీజన్ ఎండింగ్‌కు వస్తున్నా, చలి తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. పైగా చలికాలం ప్రారంభంలో ఉన్నప్పటి కంటే, ఎండింగ్‌లో చలి భారీగా పెరిగింది. చలి పెరిగిపోతున్న క్రమంలో బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక చలికాలం వచ్చింది వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. అయితే, చాలా మంది చలికాలంలో కూడా చల్లటి నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. ఇలా కూల్ వాటర్‌తో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌందర్యం కోసం కూల్ వాటర్‌తో స్నానం చేస్తే, గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లని నీరు అనేది శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
శరీర ఉష్ణోగ్రత తగ్గితే, ఉష్ణోగ్రతను పెంచేందుకు రక్తసరఫరా వేగంగా జరగుతుంది. ఫలితంగా గుండెపై ప్రభావం చూపించవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లని నీరు గుండె ఆరోగ్యానికి చేటు అని నిపుణులు చెబుతున్నారు. అయితే, వేడినీళ్లు కూడా మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నారు. వేడి నీళ్లతో స్నానం చేయడం వలన చర్మంపై ముడతలు ఏర్పడతాయి. చర్మంపై ఎర్రని దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. వేడి నీళ్లతో తలస్నానం కూడా చేయకూడదని చెబుతుంటారు. వేడి నీరు తలపై పోసుకున్నప్పుడు తలలో రక్తప్రసరణ వేగం తగ్గిపోతుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గితే బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
తల వెంట్రుకలు ఊడిపోతాయని కూడా హెచ్చిరిస్తున్నారు. వీటితోపాటుగా మరో సమస్యకూడా ఉన్నది. ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. మొటిమలు ఉన్నవారు వేడినీటితో స్నానం చేయడం వలనల మొటిమలు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక కొంతమంది చలి కాలంలో వేడి నీళ్లు, ఎండాకాలంలో చల్లని నీళ్లతో స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కొంతమంది ఏ కాలంలోనైనా చన్నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదే కానీ, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏ కాలంలో అయినా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం ఉత్తమం అని నిపుణులు పేర్కొంటున్నారు.
గోరు వెచ్చని నీరు చర్మాన్ని మృధువుగా ఉండేలా చూస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. ఎవరైనా సరే అన్నికాలాల్లోనూ మరీ వేడి నీళ్లు కాకుండా, చన్నీళ్లు కూడా కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని సూచిస్తున్నారు. పురాతన కాలం నుండి పెద్దవాళ్లు గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేసేవారని, ఈ కారణంగానే పూర్వం రోజుల్లో మనుషులు ఆరోగ్యంగా, ఎక్కువ కాలం యవ్వనంగా జీవించేవారని పరిశోధకులు చెబుతున్నారు.
కాలం మారుతుండటంతో అందంపై మక్కువతో కొందరు, ఆరోగ్యంపై శ్రద్ధతో కొందరు, చలి నుండి రక్షణ కోసమని కొందరు చన్నీళ్లే లేదా వేడి నీళ్లతో స్నానాలు చేస్తుంటారు. ఏ సమయంలో స్నానం చేయాలన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం. స్నానం చేయడానికి ప్రత్యేకమైన సమయాలను తప్పనిసరిగా కేటాయించాలి. ప్రతిరోజూ ఆ సమయం ప్రకారమే స్నానం చేయాలని తద్వారా ఒక క్రమపద్ధతి శరీరానికి అలవడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.