Coconut Husk: ఆన్ లైన్ ద్వారా కొబ్బరి పీచు అమ్మకాలు, కిలో ఎంతో తెలుసా?
Coconut Husk is available in online Market
భారతదేశంలో ఆన్ లైన్ మార్కెట్ విపరీతంగా విస్తరిస్తోంది. మనకు కావలసిన వస్తువులను ఆన్ లైన్లో ఆర్డర్ ఇచ్చి ఇంటికే వస్తువులు తెప్పించుకోవడాకి కోట్లాది మంది అలవాటు పడ్డారు. కొన్ని వస్తువుల అమ్మకాలు కూడా అప్పుడప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అటువంటి విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కొబ్బరి పీచును కూడా ఆన్ లైన్ లో అమ్ముతున్నారు.
కొబ్బరిపీచు కిలో ధర 700 రూపాయలు ఉండడం కూడా మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎప్పుడూ ఊహించని ఇటువంటి పరిణామాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కొబ్బరిపీచు అవసరం ఉన్నవారు నేరుగా ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు.
కొబ్బరి చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొబ్బరి పీచుకు కొరత ఉండదు. అక్కడ వీటి ధర చాలా తక్కువుగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఖర్చులేకుండానే కొబ్బరి పీచు దొరుకుతుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించేవారికి కొబ్బరి పీచు అంత త్వరగా దొరకదు. అత్యవసరంగా కొనాల్సి వారు ఆన్ లైన్ మార్కెట్ ను ఆశ్రయిస్తున్నారు.