Clicking Pens Ban: ఎగ్జామ్ హాల్‌లో ఇకపై ఆ పెన్నులు నిషేధం
Clicking Pens Ban: పరీక్షల కాలం మొదలవడంతో పిల్లలందరూ చదువుల్లో మునిగిపోయారు. పరీక్షలు ఏ పెన్నుతో రాయాలి అనేది ముందే ఫిక్స్ అయి కొనుక్కుని పూజలు కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇకపై కొన్ని పెన్నులు వాడకూడదని, వాటిని నిషేధిస్తున్నారని అంటున్నారు. ఎక్కువ మంది నొక్కుడు పెన్ను వాడుతూ ఉంటారు. పరీక్ష రాసే సమయంలో క్లికింగ్ పెన్నులు కావాలనే వాడుతూ ఉంటారు. పరీక్ష రాసే సమయంలో ఏదైనా ఒత్తిడి కారణంగా ఆన్సర్స్ మర్చిపోతే క్లిక్ పెన్నును నొక్కుతూ ఒత్తిడి తట్టించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇకపై ఆ అవకాశం లేకుండా క్లిక్ పెన్నులను నిషేధిస్తున్నట్లు బెంగళూరు సిటీ స్కూల్ అసోసియేషన్ ఇప్పుడు ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే పరీక్ష హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలంటే ఇలాంటి నిర్ణయం తప్పదని భావించి ఈ మేరకు ముందుకు వెళ్తున్నార్నని తెలుస్తోంది. పిల్లలు ఈ పెన్నులను పరీక్ష హాల్‌కు తీసుకురాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులను నోటిస్‌ను సైతం పంపిచగా ఈ నిర్ణయంతో కొంతమంది విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెంగుళూరు సిటీ స్కూల్స్ నిర్ణయాన్ని విద్యార్థులు మాత్రమే కాదు తల్లిదండ్రులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.