Strange Culture in Namibia: అక్కడ భార్యలను మార్చుకునే వింత ఆచారం
Strange Culture in Namibia: మన సంప్రదాయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సనాతన సంప్రదాయం ప్రకారం దేశంలో భార్య భర్తల బంధం చాలా పవిత్రమైనది. ఇంటికి ఎవరైనా కొత్తవాళ్లు వస్తే వారికి మంచి మర్యాదలు చేస్తారు. ఒకవేళ వచ్చిన అతిథులు రాత్రికి ఇంట్లో ఉంటే వారికి ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని సంప్రదాయాల్లోనైతే భార్యలను బయట వారికి కనిపించకుండా చూస్తారు. దీనినే పరదా సంప్రదాయమని పిలుస్తారు. అయితే, విదేశాల్లో సంప్రదాయాలు వేరుగా ఉంటాయి. వారు వీరు అనే తేడా లేకుండా అతిథులతో కలిసి మెలిసి జీవిస్తుంటారు. కానీ, నమీబియాలో ఉండే వింత ఆచారం చాలా విచిత్రంగా ఉంటుంది.
ఇంటికి వచ్చిన అతిథులతో వారి భార్యలను పంచుకుంటారు. అక్కడ ఇది ఒక సంప్రదాయంగా వస్తోంది. ఇంటికి ఎవరైనా అతిథి ఒంటరిగా వస్తే ఈ అతిథికి మర్యాదలు చేసి ఇంటి యజమాని భార్యను అతిధికి అప్పగించి యజమాని బయటపడుకుంటాడు. అతిథులను ఈ విధంగా సంతోషపెట్టడం ఓ ఆచారం. ఒకవేళ ఇంటికి వచ్చే అతిధి భార్యతో సహా వస్తే, రాత్రికి భార్యలను మార్చుకుంటారు. ఇద్దరూ అందుకు ఒప్పుకుంటేనే ఇలా చేస్తారు. అనాదిగా ఇలాంటి ఆచారం ఉందని, ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వినడానికి కాస్త వికారంగా ఉన్నా, వారి సంప్రదాయం కాబట్టి ఎవర్నీ తప్పుపట్టలేం.