Type 2 Diabetes: కెఫిన్‌తో టైప్ 2 డయాబెటిస్ దూరం
Type 2 Diabetes: కాఫి, టీలలో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం శరీరానికి మంచిది కాదని చెబుతుంటారు. శరీరంలో ఎక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వలన నిద్రరాదని, నిద్రలేమికి దారి తీస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే, శరీరానికి అవసరమైనంత కెఫిన్ తీసుకోవడం మంచిదే. ఎందుకంటే ఊబకాయాన్ని కెఫిన్ కొంతమేర తగ్గిస్తుంది. లావు తగ్గాలని అనుకునేవారు కెఫిన్ తీసుకోవడం మంచిది. అంతేకాదు, కెఫిన్ కొంతమేర పెద్దమొత్తంలో తీసుకోవడం వలన టైప్ 2 డయాబెటిస్ వంటిది కంట్రోల్ అవుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
రక్తంలో కెఫిన్ పెరగడం వలన బాడీలో కొలెస్ట్రాల్ కరుగుతుందని ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ కంట్రోట్ అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి సబంధించిన డేటాను మార్చి 14వ తేదీన బీజేవైఎం జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కరోలీనా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాక్‌హోమ్ యూరోపియన్ కు చెందిన 9876 మంది వ్యక్తుల జీనోమ్ డేటాను పరిశీలించి ఈ నివేదికను తయారు చేసింది. కెఫిన్ తీసుకోవడం వలన శరీరంలో బరువు, కొవ్వు స్థాయి తగ్గుతుందని తాజా నివేదికలో బయటపడింది. తీసుకున్న కెఫిన్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత కొలెస్ట్రాల్‌ను బర్న్ చేస్తుందని ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ నుండి బయటపడొచ్చని నిపుణులు స్పష్టం చేశారు.