Black Lines on Currency Notes: నోట్లపై నల్లగీతల అర్థం ఏంటో తెలుసా?
Black Lines on Currency Notes: నిత్యం మనం కరెన్సీ నోట్లను విరివిగా వినియోగిస్తుంటారు. 5, 10,20,50,100,200,500,2000 నోట్లను వినియోగిస్తుంటారు. ఈ నోట్లపై కొన్ని ప్రత్యేక గుర్తులను సింబల్స్ ను ఆర్బీఐ వినియోగిస్తుంటుంది. బ్యాంకు నోట్లు అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ముఖ్యంగా అంథత్వంతో ఇబ్బందులు పడేవారికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. అందుకే ఈ నోట్లపై ఒక వైపున గీతలను ఉపయోగిస్తారు. నోటుకు రెండువైపులా అడ్డంగా కొన్ని గీతలు ఉంటాయి. ఈ గీతలను బ్లీడ్ మార్క్స్ అని పిలుస్తారు. దృష్టిలోపం, అంథత్వం ఉన్నవారికి ఈ బ్లీడ్ మార్క్స్ అనేవి బ్రెయిలీ లిపి మాదిరిగా ఉపయోగపడతాయి.
కరెన్సీ నోటును బట్టి ఈ గీతలు ఉంటాయి. వందరూపాయల నోటుపై రెండు వైపులా నాలుగు నాలుగు చొప్పున గీతలు ఉంటాయి. అదే 200 నోటుపై తీసుకుంటే, రెండు వైపులా నాలుగు నాలుగు గీతలు వాటి మధ్యలో రెండు సున్నాలు ఉంటాయి. 500 నోటుపై ఇరువైపులా ఐదేసి చొప్పున గీతలు ఉంటే, 2000 నోటుపై ఇరువైపులా ఏడేసి చొప్పున మొత్తం 14 గీతలు ఉంటాయి. ఈ గీతలను తడిమినపుడు నోటు కంటే కొంచెం ఎత్తుగా కనిపిస్తాయి. నోటుపై ఉన్న గీతలను అనుసరించి ఆ నోటును గుర్తిస్తారు. ప్రతి ఒక్కరికి వీలుగా ఉండేవిధంగా ఆర్బీఐ నోటును ముద్రిస్తుంది.