Holi Festival: హోలీ రోజున ఈ వస్తువులను ఇంట్లో ఉంచుతున్నారా…!!?
Holi Festival: దేశంలో నిర్వహించే అతిపెద్ద పండుగల్లో హోలీ కూడా ఒకటి. హోలీ పండుగ రోజున పెద్ద ఎత్తున రంగులు జల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు. కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేడుకలను నిర్వహించుకుంటారు. సంబంధ బాంధవ్యాలు పెంచుకునేందుకు ఈ హోలీ వేడుక ఉపయోగపడుతుంది. అయితే, హోలీ పండుగ రోజున ఇంట్లో కొన్ని రకాల వస్తువులను తప్పకుండా మార్చేయ్యాలి. అలా చేయడం వలన కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. హోలీ రోజున పాత వస్తువులను హోళికా దహనం చేయాలని చెబుతుంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇంట్లో తీసేసిన పాత చీపుర్లను హోలీ ముందు రోజున తప్పకుండా మార్చేయాలి. వీలైతే పాత చీపుర్లను గొయ్యితీసి పాతిపెట్టాలి. కొత్త చీపురును ముందురోజు కొనుగోలు చేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అదేవిధంగా ఇంట్లో వాడకుండా ఉంచిన దుస్తులను ఎవరికైనా దానం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇక, తెగిపోయిన పాతబడిన చెప్పులను కూడా బయటపడేయ్యాలని పండితులు చెబుతున్నారు. పాత వాటిని తీసేసి కొత్త వాటిని కొనుగోలు చేయడం ఉత్తమం అని చెబుతున్నారు. అదేవిధంగా కొత్త పనులు ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో ఇలాంటి వస్తువులు ఏమైనా ఉంటే హోలీ ముందురోజున బయటపడేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించండి.