Health Benefits of Fruit Juices: ఈ జ్యూస్‌తో రోగాలన్నీ పరార్
Health Benefits of Fruit Juices: ఏ కాలంలో అయినా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. రోగనిరోధక శక్తి ఉన్నవారికి రోగాలు దరిశచేరవు. ఒకవేళ ఏదైనా రోగం వచ్చినా వెంటనే కోలుకుంటారు. మనిషి శరీరాన్ని అనుసరించి రక్తం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో తగిన విధంగా రక్తం ఉండి తీరాలి. రక్తం తక్కువైనా, ఎక్కువైనా అనారోగ్యం బారిన పడవలసి వస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని అనుసరించి రోగ లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా రక్తంలో తగిన విధంగా హిమోగ్లోబిన్ ఉండాలి. లేదంటే లోబీపీ వస్తుంది. అందుకే బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా కొన్ని రకాల పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఈ పండ్ల రసాలు తీసుకోవడం వలన ఆరోగ్యం సరిగా ఉంటుందని డైట్ నిపుణులు పేర్కొన్నారు.
హిమోగ్లోబిన్ తగ్గిన వారు తప్పనిసరిగా బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవాలి. ఇలా ఈ జ్యూస్ తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం క్రమంగా పెరుగుతుంది. బీట్ రూట్‌లో యాంటి ఆక్సిడెంట్, విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటి వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంతో పాటు బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. దీనితో పాటు డైట్ నిపుణులు సూచిస్తున్న మరో ఫ్రూట్ దానిమ్మ. ఈ ఫ్రూట్‌లో విటమిన్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఆక్సిడెంట్స్, పోలేట్‌లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ ఫ్రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతంది. ఫలితంగా రోగాల బారి నుండి బయటపడొచ్చు.