భారతీయ జంటలు వివాహ వేడుకలకు కొత్త ప్రాంతాలను అన్వేషిస్తున్నాయి.వివాహమనే మధుర ఘట్టాన్ని జీవితంలో మరుపురాని క్షణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
Destination weddings : భారతీయ జంటలు వివాహ వేడుకలకు కొత్త ప్రాంతాలను అన్వేషిస్తున్నాయి.వివాహమనే మధుర ఘట్టాన్ని జీవితంలో మరుపురాని క్షణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందుకనే చారిత్రక,సాంస్కృతిక,బీచ్ పర్యాటక ప్రాశస్త్యం కలిగిన కేంద్రాలను పెళ్లి వేదికలుగా మార్చుకుంటున్నాయి(destination weddings). ఫలితంగా దేశంలో సంప్రదాయ వివాహాలకు భిన్నంగా డెస్టినేషన్?(destination weddings) వెడ్డింగ్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఆర్థికంగా స్థిరపడిన వారు విదేశాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు(marriage) చేసుకుంటుంటే మధ్యతరగతి ప్రజలు దేశంలోని సుధీర్ఘ, మారుమూల ప్రాంతాల్లో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
కోవిడ్ సమయంలో తక్కువ మంది అతిధుల మధ్య వివాహాలు జరిగాయి. ఫలితంగా పెళ్లిళ్ల బడ్జెట్ కూడా
తగ్గింది. అయితే కోవిడ్ కు ముందు పెళ్ళికి హాజరయ్యే అతిధుల సంఖ్య 350నుంచి 400 గా వుండేది. ప్రస్తుతం ఇది 150 నుండి 250 వరకు వచ్చింది. అయితే పెళ్లిళ్ల బడ్జెట్(marriage budget) మాత్రం భారీగా వుంటున్నాయి. అతిధుల జాబితాలు తగ్గిపోయినప్పటికి, వివాహాలను వైభవంగా చేసుకోవడానికి ఎక్కడా రాజీ పడట్లేదు. చాలామంది డీజిటల్ ఫ్లాట్ ఫామ్ లు,వెడ్ టెక్ సంస్థలను సంప్రదిస్తూ రిసార్ట్ ,డెస్టినేషన్ వెడ్డింగ్ లను ఎంచుకోవడమే ఇందుకు కారణం.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా జరిగే వివాహాల్లో 25 శాతం భారత్ లోనే ఉంటున్నాయి. భూమీ మీద జరిగే ప్రతి నాలుగు పెళ్లిళ్ల లో ఒకటి భారతీయులదే. ప్రపంచ వివాహ పరిశ్రమలలో , భారత్ ,చైనాల వాటాయే అత్యధికం. ఇక దేశీయంగా ఢిల్లీ,ముంబై,బెంగళూరు,గోవా,లక్షద్వీప్,కేరళ,హేవ్ లాక్,ఐలాండ్,మహారాష్ట్ర లోని ఆలీబాగ్ డెస్టినేషన్ వెడ్డింగులకు కేంద్రాలుగా మారాయి. రాజస్థాన్ దేశంలోనే గొప్ప డెస్టినేషన్ వెడ్డింగ్ గా కొనసాగుతుంది.
భారతీయులు విదేశీ వెడ్డింగ్ కు డెస్టినేషన్ వెడ్డింగ్ కు((destination weddings) ) థాయిలాండ్ ను ఇష్టపడుతున్నారు. గత ఏడాది అక్కడ జరిగిన పెళ్లిళ్లలో 60% భారతీయులవే కావడం. మునుపెన్నుడూ లేనంతగా భారతీయులువే కావడం విశేషం. మునుపెన్నడూ లేనంతగా భారతీయ జంటలు బ్యాంకాక్ లో,కో,స్యామ్యూయ్,పుకెట్,హువా,హిన్,చయాంగ్ మాయ్ వివాహ వేడుకలకు కేరాఫ్ గా మారాయి.థాయ్ టూరిజం,అథారిటీ సైతం భారత్ లోని వెడ్డింగ్ ప్లానర్ల భాగస్వామ్యం కలిగి వుండటంతో సగటు ఏటా 400 జంటలు బంధుమిత్ర సమేతంగా అక్కడకు వెళ్ళి వివాహాలు చేసుకుంటున్నాయి.
భారతదేశంలో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ టూరిజాన్ని ప్రోత్సాహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ముసాయిదాను కూడా సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా 50 కి పైగా డెస్టినేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు పుణ్యక్షేత్రాలు డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలుగా వున్నాయి. ఇకపై అరకు,కోనసీమ,విశాఖ,సాగర తీరం,హార్ల్సీహిల్స్,ఇరుక్కుం దీవి ,పిచ్చులంక, హోప్ ఐలాండ్, ప్రాంతాలను విదేశీయులను సైతం ఆకర్షించేలా ఏపీటీడీసీ అభివృద్ధి చేయనుంది.