టీ తాగే అలవాటు ఉందా? అయితే కచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
Morning Tea: ఉదయం లేచిన వెంటనే టీ తోనే (Tea) గుడ్ మార్నింగ్ (Good Morning) చెప్పేవారు ఎంతోమంది. ఒక్కరోజు టీ (Drinking Tea) తాగకపోయినా ఆ రోజు ఏదో కోల్పోయినట్టు భావిస్తారు. వారు అంతగా టీకి బానిస అయిపోతారు ఎంతోమంది. ఇలాంటివారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అయితే టీ తాగే అలవాటు ఉన్నవారు కొన్ని పదార్థాలను టీకి జోడించడం వల్ల ఆ తేనెటీని సూపర్ ఫుడ్‌గా (Super Food) మార్చే అవకాశం ఉంది. టీలో సాధారణంగా కెఫీన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరమైనది. ఒక వ్యక్తిలో ఎసిడిటీ వంటి సమస్యలను ఇది పెంచేస్తుంది. ఈ సమస్యలన్నీ అధిగమించి, ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక ఆహారంగా మారాలంటే కొన్ని పదార్థాలు టీలో కలపాలి. అవేంటో తెలుసుకోండి.
దాల్చిన చెక్క
చిన్న దాల్చిన చెక్క ముక్కను పొడిలా దంచి టీలో వేయండి. మంచి రుచిని అందిస్తుంది. ఇది పొట్ట సమస్యలకు చెక్ పెడుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, వికారం వంటివి రాకుండా తగ్గిస్తుంది
అల్లం
అల్లం టీ చాలా రుచిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ బలపడేలా చేస్తుంది. జలుబు, దగ్గు వంటి వాటి నుండి అల్లం టీ బయట పడేస్తుంది.
తులసి ఆకులు
ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండడం సాధారణం. టీ కాచేటప్పుడు కొన్ని తులసి ఆకులు తీసి వేయండి. ఆ టీ టేస్టీగా ఉండటమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తులసి ఆకుల్లో విటమిన్లు, మినరల్స్, పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ తులసి టీని వేసవి, శీతాకాలంలో తాగడం వల్ల సీజనల్‌గా వచ్చే అనారోగ్యాలు దూరంగా ఉంటాయి.
యాలకులు
టీ రుచిని పెంచేందుకు ఎక్కువమంది యాలకులను వేస్తారు. కానీ ఇవి చాలా ఆరోగ్యాన్ని అందిస్తాయి. రోజూ యాలకుల టీ తాగితే శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది. యాలకుల టీ వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. నోటి దుర్వాసన వంటి సమస్యలు, గొంతు నొప్పి వంటి అనారోగ్యాలతో నుండి కాపాడుతుంది.