Weight reduction: బరువు తగ్గడానికి యువకుడి ప్రయత్నం, ఆకస్మిక మృతి
A young man died with Weight reduction tablets
బరువు తగ్గడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలను బలితీసుకుంది. చెన్నైలోని శ్రీ పెరంబదూర్‌కి చెందిన సోమంగలం బరువు తగ్గడానికి మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. అదే అతడి ప్రాణం తీసింది. పోలీసులు ఈ విషయమై విచారణ చేపడుతున్నారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్టు మార్టమ్ చేయడానికి పంపారు.
పెరంబదూర్‌కి చెందిన సూర్య అనే వ్యక్తి పాల కంపెనీలో మిల్క్ డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్నాడు. బరువు తగ్గడానికి ఏ మెడికల్ షాపు నుంచి ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాడో తెలియదని సూర్య తల్లిదండ్రులు తెలిపారు. ఇంట్లో కూడా ఎటువంటి మాత్రలు దొరకలేదని సూర్య పేరెంట్స్ తెలిపారు.
లావుగా ఉన్నాడని సూర్య స్నేహితులు అనేక సందర్భాల్లో అతడిని ఎగతాళి చేసేవారు. దీంతో కలత చెందిన సూర్య మాత్రలు వాడడం మొదలు పెట్టాడు. అనేక మంది డాక్టర్లను సంప్రదించాడు. కొంత మంది స్నేహితుల సలహా తీసుకున్నాడు. ఆన్‌లైన్ వెతకమని వారు సలహా ఇవ్వడంతో ఆ విధానాన్ని అవలంభించాడు. ఆన్‌లైన్‌లో మాత్రలు తెప్పించుకున్నాడు. వాటిని వాడడం మొదలు పెట్టాడు. ఆన్‌లైన్‌లో మాత్రలను ఆర్డర్ చేసుకున్న సూర్య డిసెంబర్ 22 నుంచి మాత్రలు వాడడం మొదలు పెట్టినట్లు పోలీసులు తేల్చారు.
జనవరి 1వ తేదీన సూర్య స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో దగ్గర్లోనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సూర్య పరిస్థితి శృతి మించడంతో చనిపోయాడు.