బంగీ జంప్... ఎత్తైన ప్రదేశం నుంచి కాళ్లకు తాడు కట్టుకొని తల క్రిందులుగా దూకడం. సాధారణంగా ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకు చూడాలంటే భయపడిపోతుంటారు. కొందరు కఠోర శ్రమను చేసి బంగిజంప్ నేర్చుకుంటారు. దీనికి తపనతో పాటు ధైర్యం, పట్టుదల కావాలి. ప్రాణాలపై ఆశకు కూడా ఒక్కోమారు వదిలేసుకోవాల్సి వస్తుంది కూడా. ఇంతటి కష్టసాధ్యమైన బంగీజంప్ను 50 ఏళ్ల వయసులో లిండా పొగిటర్ అనే సౌతాఫ్రికాకు చెందిన మహిళ చాలా ఈజీగా చేసి రికార్డ్ సాధించింది.
Bungee Jump: బంగీ జంప్… ఎత్తైన ప్రదేశం నుంచి కాళ్లకు తాడు కట్టుకొని తల క్రిందులుగా దూకడం. సాధారణంగా ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకు చూడాలంటే భయపడిపోతుంటారు. కొందరు కఠోర శ్రమను చేసి బంగిజంప్ నేర్చుకుంటారు. దీనికి తపనతో పాటు ధైర్యం, పట్టుదల కావాలి. ప్రాణాలపై ఆశకు కూడా ఒక్కోమారు వదిలేసుకోవాల్సి వస్తుంది కూడా. ఇంతటి కష్టసాధ్యమైన బంగీజంప్ను 50 ఏళ్ల వయసులో లిండా పొగిటర్ అనే సౌతాఫ్రికాకు చెందిన మహిళ చాలా ఈజీగా చేసి రికార్డ్ సాధించింది.
బంగీజంప్ను ప్రాక్టీస్ చేయడం కోసం కఠోరంగా శ్రమించింది. ఈగెనీ ఎలాఫ్ అనే కోచ్ నుంచి శిక్షణ తీసుకున్నది. 50 సంవత్సరాల వయసులో గంటల తరబడి శిక్షణ పొందింది. అవసరమైన ఫిట్నెస్ కోసం జిమ్లో కష్టించింది. బంగీజంప్ కోసం అవసరమైన ఫిట్నెస్ను సాధించిన తరువాత కాంపిటీషన్లో పాల్గొన్నది. సౌతాఫ్రికాలోని 216 మీటర్ల ఎత్తైన బ్లౌక్రాన్ బ్రిడ్జి మీద నుంచి ఒక గంట వ్యవధిలో 23 సార్లు బంగిజంప్ చేసి గిన్నీస్ రికార్డ్ సాధించింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వయసు ఏ మాత్రం అడ్డుకాదని మరోమారు నిరూపించింది. 19 ఏళ్ల నాటి రికార్డును లిండా బ్రేక్ చేసింది.