జింబాబ్వే అధ్యక్షుడిగా రెండోసారి ఎమ్మర్సన్ మంగాగ్వా (Emmerson Mnangagwa) ఎన్నికయ్యారు. శనివారం వెల్లడైన ఫలితాల్లో మంగాగ్వా గెలుపొందారు. తన ప్రత్యర్థి నెల్సన్ చామిసాపై (Nelson Chamisa) భారీ మెజార్టీతో విజయం సాధించారు.
Zimbabwe: జింబాబ్వే అధ్యక్షుడిగా రెండోసారి ఎమ్మర్సన్ మంగాగ్వా (Emmerson Mnangagwa) ఎన్నికయ్యారు. శనివారం వెల్లడైన ఫలితాల్లో మంగాగ్వా గెలుపొందారు. తన ప్రత్యర్థి నెల్సన్ చామిసాపై (Nelson Chamisa) భారీ మెజార్టీతో విజయం సాధించారు. కొద్దిరోజులుగా ఎమ్మర్సన్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. గతంలో జను పీఎఫ్ పార్టీ హయాంలో ఎమ్మర్సన్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ప్రజలు రెండోసారి ఆయనకే పదవిని కట్టబెట్టారు. అధ్యక్ష కుర్చీలో కూర్చోబెట్టారు.
మంగాగ్వా కంటే ముందు అధ్యక్ష పదవి చేపట్టిన వారంతా మధ్యలోనే పదవికి రాజీనామా చేశారు. కానీ మంగాగ్వా తొలిసారి పూర్తికాలం పదవిలో కొనసాగి రికార్డుకెక్కాడు. త్వరలోనే ఎమ్మర్సన్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇకపోతే జింబాబ్వే దాదాపు రెండు దశాబ్దాలుగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రావడంతో లేదు. ఆర్థిక సంక్షోభంతో జింబాబ్వే ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలు, ఇంధన ధరలు అక్కడ ఆకాశానికి తాకుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిక తోడు నిరుద్యోగం కూడా జింబాబ్వేలో భారీగా పెరిగిపోతోంది.