న్యాయశాస్త్రంలో 8 వ వింత జరిగింది అని సీబీఐ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ హైకోర్టు పై చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వివేకా కేసులో గంగిరెడ్డి ఎప్పుడు విడుదల చేయాలో తేదీ తో సహా చెప్పడం విడ్డూరం అని దీని పై సుప్రీం లో పిటీషన్ వేయబోతున్నట్లు ప్రకటించింది..
YS VIVEKA CASE: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS VIVEKA) హత్య (Murder) కేసు (Case)లో ప్రధాన నిందితుడైన గంగిరెడ్డి (Gangireddy) బెయిల్ (Bail) ను రద్దు చేస్తూ, అదే క్రమంలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ (Telangana) హైకోర్టు (High Court) ఇచ్చిన అసాధారణ ఉత్తర్వులపై సుప్రీం కోర్టు (Suprem Court) విస్మయం వ్యక్తం చేసింది . బెయిల్ (Bail)ను రద్దు చేయడం.. మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై సీజేఐ (CJI)డీవై చంద్రచూడ్ ధర్మాసనం అసహనం వ్యక్తం ఇదేదో ఎనిమిదో వింత (8th Wonder)లా ఉందని అన్నారు సుప్రీం న్యాయమూర్తి, ఇవేం ఉత్తర్వులు అంటూ సీజేఐ ధర్మాసనం (Bench) తల పట్టుకుంది.
సునీత పిటిషన్ లో ఏముందంటే…
ఇకపోతే ఎర్ర గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దు చేస్తూ… తెలంగాణ హైకోర్టు ఆదేశాలివ్వడాన్ని సవాల్ చేస్తూ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 30లోపు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని… ఆ మరుసటి రోజు జులై 1న గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంపై పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. జూలై 1న బెయిల్ ఇవ్వాలని షరతు విధిస్తూ… హైకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టాలని గత వారం సీజేఐ ముందు వైఎస్ సునీతారెడ్డి తరపు న్యాయవాది మెన్షన్ చేసిన సంగతి తెలిసిందే.
శుక్రవారానికి వాయిదా..
ఈ పిటిషన్‌ను బుధవారం సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది. బెయిల్ రద్దు చేయడం ఏంటి విచారణ ముగిసిన మరుసటి రోజు బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎనిమిదో వింతలా ఉందని సీబీఐ తరఫు న్యాయవాది ఏఎస్జీ సంజయ్ జైన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు గంగిరెడ్డి పిటీషన్‌పై కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. దీంతో సుప్రీం కోర్టు ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
సుప్రీం ఆశ్చర్యం దేనికంటే…
బెయిల్ రద్దు చేయటం.. మళ్లీ ఓ రోజున విడుదల చేయాలని తీర్పు చెప్పటం బహుశా న్యాయచరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ కావచ్చు. ఇదే సుప్రీం కోర్టును ఆశ్చర్య పరిచింది. హై కోర్టు తీర్పుపై సుప్రీం ధర్మాసనం అంతకు మించి కామెంట్లు చేయకూడదు కనుక.. అంతటితోనే సరిపెట్టింది. ఈ బెయిల్ పిటిషన్ తీర్పు తర్వాత న్యాయవ్యవస్థపై సందేహాలు సహజంగానే తలెత్తుతాయి. సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యల తర్వాత అనుమానాలు మరింత బలపడతాయి. ఇప్పటికే వివేకా హత్య కేసులో పిటిషన్ల మీద పిటిషన్లు పడుతుండటం… మిగతా కేసులన్నీ పక్కనబెట్టి ఈ కేసుల సంగతి తేల్చాలన్న అభ్యర్థనలపై న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మునుముందు ఇలాంటి పరిణామాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని న్యాయనిపుణులు అంటున్నారు.