Whatsapp: వేల కొద్ది మెసేజింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువగా అందరూ ఉపయోగించే యాప్ వాట్సాప్ (Whatsapp). ప్రతి స్మార్ట్ ఫోన్లోనూ (Smartphones) ఈ యాప్ తప్పనిసరిగా కనిపిస్తుంటుంది. వ్యక్తిగత సమాచారంతో పాటు ఆఫీస్ పనులు, ఫొటోలు, వీడియోలు ఇతర డాక్యుమెంట్లను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకుంటుంటారు.
Whatsapp: వేల కొద్ది మెసేజింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువగా అందరూ ఉపయోగించే యాప్ వాట్సాప్ (Whatsapp). ప్రతి స్మార్ట్ ఫోన్లోనూ (Smartphones) ఈ యాప్ తప్పనిసరిగా కనిపిస్తుంటుంది. వ్యక్తిగత సమాచారంతో పాటు ఆఫీస్ పనులు, ఫొటోలు, వీడియోలు ఇతర డాక్యుమెంట్లను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకుంటుంటారు. అటు వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు తమ యూజర్లకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను (New Features) యాడ్ చేసుకుంటూ వస్తోంది. కొత్త కొత్త అప్డేట్స్ను (Updates) తీసుకొస్తోంది. ఈసారి కూడా ఇంతకముందు ఎప్పుడూ లేని విధంగా అద్భుతమైన అప్డేట్ను తీసుకొచ్చింది వాట్సాప్.
చాలా మంది వాట్సాప్‌లో ఒకటి పంపించాలనుకొని మరొకటి పంపించి ఇబ్బంది పడుతుంటుంటారు. వెంటనే డిలీట్ చేసి మళ్లీ పంపిస్తుంటారు. అటువంటి వారి కోసం ఎడిట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. ఇక నుంచి ఏదైనా తప్పు మెసేజ్ పంపిస్తే దానిని డిలీట్ చేయాల్సిన పని లేదు. దానినే ఎడిట్ చేసుకోవచ్చు. మెసేజ్ పంపించిన 15 నిమిషాల వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ 15 నిమిషాలు దాటిన తర్వాత మెసేజ్‌లను ఎడిట్ చేసుకునేందుకు కుదరదు.
ఇక మెసేజ్‌ను ఎడిట్ చేయాలంటే ముందుగా పంపిన మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. అప్పుడు కాపీ, సెలక్ట్, ఫార్వర్డ్ ఆప్షన్లతో పాటు ఎడిట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ముందుగా పంపిచిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ వాట్సాప్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్ తన ఫేస్బుక్ హ్యాండిల్లో ఓ వీడియోను షేర్ చేశారు.