2019 కంటే గొప్ప విజయాన్ని ప్రజలు అందించాలని సజ్జల కోరారు. జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగేళ్లయిన సందర్భంగా ఆయన పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు
Sajjala On Avinash : సీఎం (CM) జగన్ (Jagan) సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల (Sajjala) అన్నారు. కేంద్ర ప్రభుత్వ (Central Government) సంస్థ (Institutions)లు ఏపీలో జగన్ పాలనను మెచ్చుకుంటున్నాయని తెలిపారు. వైసీపీ (YSRCP) ప్రభుత్వం (Government) అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన సందర్భంగా సజ్జల మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని, అవినీతికి వ్యతిరేకంగా, పారదర్శకంగా సంక్షేమం అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. డెవలప్ మెంట్ అంటే చిన్న ఫ్యాక్టరీ లు 4, 5 పెట్టడం గొప్ప కాదని సజ్జల తెలిపారు. పాలన వికేంద్రీకరణ ద్వారా 3 రాజధానులతో కోర్టు వివాదాలు దాటితే ఆదర్శమైన పాలన ప్రారంభం అవుతుందన్నారు. 2019 కన్నా మించిన విజయం అందించాలని ఆయన ప్రజలను కోరారు.
అవినాష్ రెడ్డిపై తప్పుడు ప్రచారం -టైం అడిగారు.. ఇస్తే ఏమవుతుంది ?
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే నాటకాలు అంటూ ప్రచారం చేస్తారా అని సజ్జల మండిపడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే ఆరు సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారన్నారు. . వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో అవవసర కథనాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఓ వర్గం మీడియాపై మండిపడ్డారు. అవినాష్ రెడ్డి విషయంలో కూడా రోత రాతలు రాస్తున్నారని ఆయన విమర్శించారు. అవినాష్ రెడ్డి అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. అవినాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. రామోజీరావు కేసులో ఏ కోర్టుకైనా వెళ్లొచ్చా? అవినాష్ వెళ్తే ఎలా తప్పు అవుతుంది?. హైదరాబాదు వెళ్తే ఎందుకు వెళ్లారని అడుగుతారు?. బెంగుళూరు వెళ్తే ఎందుకు వెళ్ళారని అడుగుతారు?. వారిష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. పబ్లిక్ ఇష్యూస్‌ను పక్కదారి పట్టించేలా ఆ మీడియా వ్యవహరిస్తోందని సజ్జల మండిపడ్డారు.