వేణుస్వామి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా సెలబ్రిటీలకు(cinema celabraties), రాజకీయ సెలబ్రిటీలకు జాతకం (Horoscope)చెబుతూ ఉంటారు. వారికి జాతకాలు చెప్పి చెప్పి.. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. కొన్ని నిజం కావడంతో ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయ్యారు.
Venuswami : వేణుస్వామి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత-నాగచైతన్య విడాకుల విషయంతో బాగా హైలట్ అయ్యారు. ఆ తర్వాత నిధి అగర్వాల్‌తో కూడా పూజలు చేయించారు. కానీ.. ఆమెకు మాత్రం అనుకున్నంత ఆఫర్స్ ఏవీ రాలేదు. దీంతో వేణుస్వామి చేసిన పూజలు ఫలించలేదా..? ఆయన చెప్పినవన్నీ గాలి మాటలేనా..? అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా నిధి అగర్వాల్ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు వార్త వినిపిస్తోంది.
ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత అందుకు తగ్గ అవకాశాలు అందుకోలేకపోయింది. పవన్ కల్యాణ్ సరసన అదిరిపోయే ఆఫర్ అందుకుంది. హరిహరవీరమల్లు సినిమాకు నిధి అగర్వాలే హీరోయిన్. అయితే ఆ చిత్రం 2020 నుంచి పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటోంది. ఏఎం రత్నం నిర్మాత కాగా, క్రిష్ దర్శకుడు. తాజాగా ప్రభాస్ సరసన ఆఫర్ అందుకోవడంతో వేణుస్వామి పూజలు ఫలించాయని తెలుగు సినీ పరిశ్రమలో టాక్ వినపడుతోంది.