అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి మొదలైంది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నటు ప్రకటించారు. నామినేషన్ దాఖలు చేశారు
ఫ్లోరిడా (Florida) గవర్నర్ ( Governer)రాన్ డెశాంటిస్ (Ron DeSantis) అమెరికా (US) అధ్యక్ష (President) రేసులోకొచ్చారు. అధ్యక్ష పదవి కోసం తాను ప్రచారం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించేశారు. అమెరికా పునర్వైభవం కోసం తాను పోటీ చేయబోతున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. యూఎస్ కు సారథ్యం వహించే ధైర్యం కావాలి, గెలిచే శక్తి ఉండాలి అంటూ తన ప్రచార నినాదంతో రాన్ డెశాంటిస్ ప్రచారం ప్రారంభించారు. అయితే అదే టైమ్ లో ట్విటర్ క్రాష్ అయిపోవడం గమనార్హం. రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బిడ్‌ను ధృవీకరిస్తూ ఫెడరల్ ఎన్నికల అధికారులకు నామినీ పత్రాలను దాఖలు చేశాడు. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి డెశాంటిస్ పోటీకొచ్చాడు. ఎన్నికల ప్రచారంలో మొదటి రోజు ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్‌తో కలిసి ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ లైవ్ ఆడియో ఛాట్‌లో పాల్గొన్నారు. ఆరున్నర లక్షల మందికిపైగా ఆ సంభాషణను లైవ్‌లో విన్నారు. గతేడాది అక్టోబర్‌లో ఎలన్ మస్క్.. ట్విటర్‌ను టేకోవర్ చేశాడు. ఆ సమయంలోనే వేలమంది ఉద్యోగులను తొలగించాడు. సరిగా ఈ లైవ్ సంభాషణ జరుగుతుండగానే ట్విట్టర్ పలు మార్లు క్రాష్ అయింది.
I’m running for president to lead our Great American Comeback. pic.twitter.com/YmkWkLaVDg
— Ron DeSantis (@RonDeSantis) May 24, 2023