టీటీడీ (TTD) చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) చైర్మన్ అయిన తరువాత టీటీడీ(TTD)కి కొత్త పాలకమండలి సభ్యులను నియమించారు. శుక్రవారం వరమహాలక్ష్మి పండుగ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యుల పేర్లు విడుదల చేసింది.
TTD : టీటీడీ (TTD) చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) చైర్మన్ అయిన తరువాత టీటీడీ(TTD)కి కొత్త పాలకమండలి సభ్యులను నియమించారు. శుక్రవారం వరమహాలక్ష్మి పండుగ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యుల పేర్లు విడుదల చేసింది. 24 మంది టీటీడీ బోర్డు సభ్యులుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన వారు టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించారు.
గతంలో టీటీడీ బోర్డు సభ్యులుగా పని చేసిన కొందరికి మాత్రం మరోసారి అవకాశం చిక్కింది. టీటీడీ బోర్డు సభ్యులుగా కొందరు ఎమ్మెల్యేలకు, ఓ ఎంపీ భార్యకు అవకాశం చిక్కింది. అయితే టీటీటీ బోర్డు సభ్యుల నియామకంపై ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం జగన్(CM Jagan) ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తిరుమల పవిత్రను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం (YCP Government) ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
టీటీడీ పాలకమండలి నియామకాలపై జగన్ ప్రభుత్వం మీద ఏపీ బీజేపీ(BJP) అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకుని తరువాత అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డిని(Sharath Chandra Reddy) టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారని, లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు శ్రీవారి సేవ చేస్తారా..? అంటూ పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎంసీఐ స్కామ్ కేసులో అరెస్టు అయ్యి దోషిగా తేలిన డాక్టర్ కేతన్ దేశాయ్.. తరువాత ఆయన పదవిని కోల్పోయారని, అలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారని, వైసీపీకి టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రం అయ్యిందని, దీనీనీ బీజేపీ తీవ్రస్థాయిలో ఖండిస్తోందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. టీటీడీ బోర్డు సభ్యుల నియమాకంపై ఇప్పటికే వైసీపీ(YCP) ప్రభుత్వం మీద టీడీపీ నాయకులు (TDP Leaders) దుమ్మెత్తి పోస్తున్నారు.