తెలంగాణ గ్రూప్ 1(telagana group-1 exams) ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 11 నిర్వహించనున్నారు. పేపర్ లీక్ వ్యవహారంతో గ్రూప్ 1(group-1 exams) పరీక్షల్ని రద్దు చేశారు. దీంతో ఈ పరీక్షల్ని తిరిగి ఆఫ్‌లైన్ పద్ధతిలో, ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.
తెలంగాణ గ్రూప్ 1(telagana group-1 exams) ప్రిలిమినరీ పరీక్ష జూన్ 11 ఇవాళ జరుగుతుంది . పేపర్ లీక్ వ్యవహాతో గ్రూప్ 1(group-1 exams) పరీక్షల్ని రద్దు చేశారు. దీంతో ఈ పరీక్షల్ని తిరిగి ఆఫ్‌లైన్ పద్ధతిలో, ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.జూన్ 11(june 11th)న ప్రిలిమినరీ(group-1 exams pilimanari) పరీక్ష నిర్వహించనున్నట్టు టిఎస్పిఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత ఏడాది ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అక్టోబర్ 16న పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2,85,916 మంది హాజరయ్యారు.
మెయిన్స్ పరీక్షలకు 25,050 మందిని కమిషన్ ఎంపిక చేసింది. ఈ క్రమంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో టీఎస్పీఎస్సీ (tspsc)గ్రూప్-1 ప్రిలిమ్స్‌తోపాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేసింది. మళ్లీ కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించింది.పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా బీఎం సంతోష్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా ఎన్ జగదీశ్వర్ రెడ్డిని నియమించారు.వీరితో పాటు కొత్తగా డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్, జూనియర్ సివిల్ జడ్జి క్యాడర్ లా ఆఫీసర్ పోస్టులను మంజూరు చేసింది.(Group I Prelims Exams 11th June 2023)పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో గతంలో పనిచేసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరినీ మార్చింది. కొత్తగా ప్రశ్నపత్రాలను రూపొందించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని ఉద్యోగుల విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. జూన్ 11(june 11th group-1 exams)నే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది(Group I Prelims Exams 11th June 2023). షెడ్యూల్ ప్రకారమే పరీక్ష జరుగుతుందని టీఎస్పీఎస్సీలో ఉన్నతాధికారి స్పష్టం చేశారు.రేపటి పరీక్షపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష చేపట్టారు. పరీక్షల నిర్వహణకు పకడ్బంది ఏర్పాట్లు చేసి పరీక్షను సాఫీగా జరిగే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు.
ఆన్లైన్ పరీక్ష రాసేందుకు అవకాశం
తెలంగాణలో ప్రస్తుతం 25 వేలలోపు అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉన్నది. ఆ సంఖ్యను 50 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం 25 వేల నుంచి 50 వేలలోపు మంది అభ్యర్థులు ఉంటే కంప్యూటర్ బెస్డ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. రెండు సెషన్లలో పరీక్షను పూర్తిచేసి, మార్కులను నార్మలైజేషన్ పద్ధతిలో లెక్కిస్తున్నారు. లక్ష కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే మాత్రం ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను సైతం ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.
ఎగ్జామ్ వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
ఇంకా అభ్యర్థులు షూలు ధరించి రావొద్దని.. చెప్పులను ధరించే ఎగ్జామ్ సెంటర్లకు రావాలని అధికారులు సూచించారు. గోరింటాకు, టాటూలతో రావొవద్దని కమిషన్ స్పష్టం చేసింది. ఇంకా వాచీలు కూడా వద్దని తెలిపింది. అయితే.. అభ్యర్థులకు సమయం తెలియడం కోసం ప్రతీ అరగంటకు ఓ సారి బెల్ మోగించనున్నట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థులు ఎవరైనా నిబంధనలు పాటించకుంటే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.ఓఎంఆర్ షీట్ నింపే ముందు ఒకటి రెండు సార్లు నిబంధనలు చదువుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచిస్తున్నారు. ఎలాంటి మిస్టేక్ చేసినా ఓఎంఆర్ ను వాల్యుయేషన్ చేయబోమని బోర్డు స్పష్టం చేసింది. ఇంకా గ్రూప్-1 పరీక్ష నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సైతం అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బస్టాండ్ల నుంచి కేంద్రాలకు స్పెషల్ బస్సులను నడపనుంది.
పోటీ పరీక్షలు రాసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
పోటీ పరీక్షల్లో చాలా మంది పరీక్షకు దగ్గర పడుతున్న టైం లో చుదువుతు వుంటారు.. ప్రిపరేషన్ చేయలేదని కుంగిపోతు వుంటారు. ఎంత చదివినా చదవాల్సిన అంశాలు ఇంకా మిగిలే వుంటాయి. కాబట్టి అభ్యర్ధులు పరీక్షా సమయంలో ఆందోళన చెందవద్దు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షకు హాజరవ్వడం పై దృష్టి సారించాలి. ఈ సమయంలో కొత్త అంశాలను చదవకుండా నేర్చుకున్న అంశాలనే రివిజన్ చేసుకోవాలి. అంతే కాకుండా పరీక్షా సమయంలో అన్ని ప్రశ్నలకు దాదాపు 150 ప్రశ్నలకు ప్రశ్నలకు సమాధానాలు వచ్చిన రాకపోయినా ఆన్సర్ చేయాలి. కొంత మందికి ప్రశ్నలు కఠినంగానే వుంటాయి. కాని అభ్యర్ధులు ఆందోళన చెందవద్దు.
ఆప్షన్లపై అప్రమత్తం
బహైళైచ్ఛిక సమాధాన ప్రశ్నల్లో ఆఫ్షన్లు గందరగోళంగా వున్నా..అ భ్యర్ధుల సామార్ధ్యాలను పరీక్షించేందుకు అత్యంత సారూప్య మున్న ఆప్షన్లు ఇస్తారు. ప్రశ్న చూడగానే సమాధానాన్ని ఆప్రమత్తతో పరిశీలించుకోవాలి. వాటిని అర్ధం చేసుకుని సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి. ప్రశ్నీ పత్రంలో బాగా తెలిసిన సమాధానాలను గుర్తించాలి. క్లిష్టమైన ప్రశ్నలకు తరువాత సమయాన్ని కేటాయించుకోవాలి. సబ్టెక్టు విషయంలో ,జనరల్ స్టడీస్ కు సంబంధించిన ఎకానమీ ,జాగ్రఫీ డిజాస్టర్స్ , తదితర సబ్జెక్టులు అనుసంధానాన్ని కలిగి వుంటాయి.
మరిన్ని జాగ్రత్తలు
1,తగినంత సమయం నిద్రపోవాలి.. ఒత్తిళ్ళకు దూరంగా వుండాలి.
2, పరీక్షా హాల్ టికేట్లు ,బ్లూ ,బ్లాక్ పెన్నులను ముందుగానే సిద్దం చేసుకోవాలి. హాల్ టీకెట్ లపై సూచనలు చదివి అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవాలి.
3 ,పరీక్షా కేంద్రం లోకి అభ్యర్ధులను రెండు గంటల ముందునుంచే అనుమతిస్తారు. 15 నిమిషాల్లో పరీక్షా ప్రాంభం అవుతుంది అనగా గేట్ మూసివేస్తారు.
4 ,ఓఎంఆర్ షీట్ ను ఇన్విజిలేటర్ కు ఇచ్చే సమయంలో దానిపై పొందు పరిచిన హాల్ టికెట్ నెంబర్ ,టెస్ట్ బుక్ లెట్ నెంబర్ తదితర సమాచారాన్ని ఒకసారి చూసుకోవాలి.
5, పరీక్షా రాసే వారు చిన్న చిన్న విషయాలపై జాగ్రత్త వహించాలి.