Tipu Sultan: మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ (Tipu Sultan) ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన ఖడ్గాన్ని (Sword) లండన్‌లో వేలం వేశారు. ఆ ఖడ్గానికి వేలంలో విశేష ఆదరణ లభించింది.
Tipu Sultan: మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ (Tipu Sultan) ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన ఖడ్గాన్ని (Sword) లండన్‌లో వేలం వేశారు. ఆ ఖడ్గానికి వేలంలో విశేష ఆదరణ లభించింది. దానిని దక్కించుకునేందుకు జనాలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. చివరికి ఓ వ్యక్తి ఆ ఖడ్గాన్ని 14 మిలియన్ పౌండ్లకు దక్కించుకున్నాడు.
లండన్‌లోని బోన్హమ్స్ ఆక్షన్ హౌస్‌లో ఈనెల 23న టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఖడ్గాన్ని వేలం వేశారు. దానిని దక్కించుకోవడం కోసం ఎంతో మంది పోటీ పడ్డారు. అయితే ధర భారీగా పెరుగుతూ పోతుండడంతో మధ్యలోనే చాలా మంది డ్రాప్ అయ్యారు. ముగ్గురు మాత్రం చివరి వరకు తీవ్రంగా పోటీ పడ్డారు. లాస్ట్‌కి వారిలో ఒకరు 1,40,80,900 పౌండ్లకు ఖడ్గాన్ని దక్కించుకున్నాడు. అంటే భారత కరెన్సీలో రూ. 144 కోట్లు అన్నమాట. అయితే తాము అంత పెద్ద మొత్తానికి ఖడ్గం అమ్ముడుపోతుందని ఊహించలేదని ఆంక్షన్ నిర్వాహకులు తెలిపారు. తాము అనుకున్న దానికంటే 7 రెట్లు ఎక్కవ ధరకు అమ్ముడుపోయిందని వివరించారు.
ఇకపోతే టిప్పు సుల్తాన్ మరాఠాలపై 1175 నుంచి 1779 వరకు యుద్ధం చేసిన సమయంలో ఈ ఖడ్గాన్నే ఉపయోగించారట. ఆయన మరణానంతరం బ్రిటీషర్లు ఈ ఖడ్గాన్ని మేజర్ జనరల్ డేవిడ్ బెయిర్డ్‌గి అప్పగించారట. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఖడ్గం.. అత్యంత అద్భుతంగా తయారైన వాటిలో ఒకటి. అంతేకాకుండా టిప్పు సుల్తాన్ వద్ద ఉన్న ఆయుధాల్లో ఈ ఖడ్గం అత్యంత కీలమైనది. అందుకే వేలంలో అంత భారీ ధర పలికిందని వేలం నిర్వాహకులు తెలిపారు.