హిందూ క్యాలెండర్లో ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 30న జరుపుకోవాలి. కానీ రక్షా బంధన్ పండుగ రోజు భద్ర నీడ (Badra Needa) ఉంది. ఈ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.
Rakhi festival: సోదరులున్న అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. ఇక చిన్నపిల్లలు అయితే నెల రోజుల ముందు నుంచీ ఎలాంటి రాఖీ కట్టాలి.. ఏ గిప్ట్ కొట్టేయాలని ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే సొంత అన్నదమ్ములు లేనివాళ్లు ఆ వరుస అయినవాళ్లకు రాఖీలు కట్టి తమ సంతోషాన్ని చాటుకుంటారు. ఆ సమయంలో వారిచ్చే కానుకలను అందరికీ చూపిస్తూ మురిసిపోతారు. అయితే ఈ ఏడాది రాఖీ పండుగ రెండు రోజులు వస్తుంది. దీంతో తమ సోదరులకు ఏ సమయంలో రాఖీ కడితే వారికి శుభాలు కలుగుతాయా అని చాలామందికి అనుమానం వస్తుంది.
మంచి సమయంలోనే అన్నదమ్ములకు రాఖీ కట్టాలి. కానీ ఆ భద్రనీడలో కట్టకూడదంటారు. అయితే, ఈ సారి పండగ రోజు భద్ర నీడ ఉండడంతో.. రాఖీ పండుగ తేదీపై అందరిలో అయోమయం ఏర్పడింది. ఇటు పండితులు ఈ పండుగ గురించి చెబుతున్న దాని ప్రకారం.. హిందూ క్యాలెండర్లో ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 30న జరుపుకోవాలి. కానీ రక్షా బంధన్ పండుగ రోజు భద్ర నీడ (Badra Needa) ఉంది. ఆగస్టు 30(August 30)న ఉదయం 10గంటల 59 నిమిషాల నుంచి రాత్రి 9.02 గంటల వరకూ కూడా భద్ర కాలం ఉంది. ఈ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.
భద్ర కాల సమయం ముగిశాకే రాఖీ కడితే మంచిదని అంటే ఆగస్ట్ 31 (August 31) ఉదయాన్నే రాఖీ కట్టాలని పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా తాము ఆగస్టు 30న రాఖీ కట్టాలని అనుకుంటే మాత్రం రాత్రి 9.15 గంటల తర్వాత శుభ ముహూర్తం మొదలవుతుంది కాబట్టి అప్పుడు కట్టాలి. అలాగే ఆగస్టు 31న ఉదయం 7.5 నిమిషాల వరకు మాత్రమే రాఖీ కట్టే శుభ సమయం ఉంటుంది. ఈ మధ్యనే రాఖీ కడితే సోదరులకు శుభం కలుగుతుంది. దీంతో ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 30, 31 తేదీల్లోనూ జరుపుకోబోతున్నారు.