దేశ రాజధాని(Capital) ఢిల్లీ (Delhi)లో నిర్మించిన అత్యద్భుత కట్టడం.. పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా (Central Vista) ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని (PM) మోడీ (Modi)ప్రారంభించనున్నారు.
NEW PARLAMENT BUILDING: దేశ రాజధాని(Capital) ఢిల్లీ (Delhi)లో నిర్మించిన అత్యద్భుత కట్టడం.. పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా (Central Vista) ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని (PM) మోడీ (Modi)ప్రారంభించనున్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు (Nine Years) పూర్తయిన సందర్భంగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్ (New Parlament Buiding)ను అందుబాటులోకి తీసుకు రానున్నారు. 2020 డిసెంబర్లో మోడీ కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను శంకుస్థాపన (Bhoomipooja) చేయగా 2021 అక్టోబర్ (Ocober)1 నుంచి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. రూ. 970 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త పార్లమెంట్ ను నిర్మించారు. దాదాపుగా పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. దేశ వైభవానికి చిహ్నంగా..వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాంతీయ కళల సమాహారంగా రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవనం (New Parlament Buiding) ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. నూతన పార్లమెంట్ భవనానికి తుది హంగులు అద్దుతున్నారు. దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Sessions) కొత్త పార్లమెంట్ భవనంలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నాలుగంతస్తుల్లో పార్లమెంట్ భవనం
ఎన్నో విశేషాల సమాహారం ఈ కొత్త పార్లమెంట్ భవనం . త్రిభుజాకారంలో ఉన్న ఈ సెంట్రల్ విస్టా భవనం దాదాపు 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్లమెంట్ నాలుగు అంతస్తులతో ఉంటుంది. మొత్తం 1,224 మంది ఎంపీలకు కూర్చునే అవకాశం ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి, వాటికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని పేర్లు పెట్టారు. ఇంకా పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు కమిటీ గదులు కూడా ఎన్నో హంగులతో రూపుదిద్దుకున్నాయి. వాస్తవానికి 2022 నవంబర్ కల్లా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. వివిధ కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది. అయితే జనవరి చివరి నాటికి సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు నిర్మాణ బాధ్యతలను తీసుకున్న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ పనులు వేగవంతం చేసింది. రెండున్నరేళ్లలోపే కొత్త పార్లమెంట్ నిర్మాణం ప్రారంభానికి సిద్ధమైంది.
ప్రముఖుల చిత్రాలు
అపురూప కళాఖండాలతో పాటు. కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ తో పాటుగా దేశంలో ప్రధాన మంత్రులుగా చేసిన వారి ఫొటోలను పొందుపరచనున్నారు. ఈ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కనీ వినీ ఎరుగని రీతిలో వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
కానిస్టిట్యూషన్ హాల్…
కొత్త పార్లమెంట్ భవనంలో భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించే భారీ కానిస్టిట్యూషన్ హాల్ ఉంటుంది. రాజ్యాంగానికి సంబంధించిన ఒరిజినల్ కాపీని ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాగే భారతీయ ప్రజాస్వామ్య వారసత్వాన్ని చాటిచెప్పేలా డిజిటల్ డిస్ప్లేను సందర్శకుల గ్యాలరీలో ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ హౌస్‌ను అలాగే ఉంచి అవసరమైన పార్లమెంటరీ కార్యక్రమాల కోసం వాడుతారు. కాగిత రహిత కార్యాలయాల దిశగా కొత్త పార్లమెంట్ భవనంలో డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లు ఏర్పాటు చేయనున్నారు.
మోడీ పర్యవేక్షణలో
ఈ భవనం నిర్మాణ పనులను ప్రధాని మోడీ పలు మార్లు స్వయంగా పరిశీలించారు. శంకుస్థాపన జరిగిన నాటి నుంచి ఎన్నో సార్లు ఆయన ఆకస్మికంగా సెంట్రల్ విస్టా పనులను పర్యవేక్షించారు.
ఏమిటీ సెంట్రల్ విస్టా..
దేశ రాజధాని లుట్యెన్స్ జోన్లో కేంద్ర ప్రతిష్ఠాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ది చేశారు. ఇందులో భాగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం,కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం, ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న 3కి.మీ రాజ్‌పథ్ పునరుద్దరిస్తారు. అలాగే పలు నూతన ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్మించారు.
Delhi | PM Narendra Modi went for a surprise visit to the new Parliament building. He spent more than an hour and inspected various works along with observing the facilities coming up at both houses of the Parliament: Sources pic.twitter.com/jecEv7fVBT
— ANI (@ANI) March 30, 2023