Telangana Results : రేపు టిఎస్ పాలిసెట్ పరీక్షా ఫలితాలు విడుదల
తెలంగాణ పాలిసెట్ -2023 ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 17వ తేదీన పాలీసెట్ 2023 పరీక్ష నిర్వహించారు. పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు పాలీసెట్ రాశారు. ఈ సెట్లో ఉత్తీర్ణులైనవాళ్లు నేరుగా ఇంజినీరింగ్, నాన్ – ఇంజినీరింగ్, టెక్నాలజీ సంబంధిత డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాల్లో చదువుకునే వీలుంది. అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సులను ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ(PJTSAU), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ యూనివర్సీటీ(SKLTSHU)లు అందిస్తున్నాయి. మే 17వ తేదీన నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 92.94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పాలీసెట్ ప్రవేశ పరీక్షకు 58,520 మంది బాలురు, 47,222 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. 54,700 మంది బాలురు, 43,573 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా, 98,273 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.