WTC Final 2023: ఐపీఎల్ సమరం ముగిసింది. ఈ నెల 7 నుంచి 11 మధ్య డబ్ల్యూటీసీ 2021-23 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ పైనే ఇప్పుడు అందరి చూపు నెలకొంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రెండవ ఎడిషన్‌కు రిజర్వుడే కూడా ఉంది. జూన్ 12-16 మధ్య డబ్ల్యూటీసీ 203 జర్వుడే ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ ఫైనల్ కోసం టీమ్ ఇండియా ఇప్పటికే లండన్ చేరుకుంది. ఐపీఎల్ తర్వాత.. యువ ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ లో చోటు దక్కింది. అటు ఆసీస్ తమ దూకుడు కొనసాగేంచేందుకు కసరత్తు చేస్తోద. తుది టీం ఎంపిక కీలకం కానుంది.
డబ్ల్యూటీసీ మ్యాచ్ కోసం అజింక్యా రహానేతో పాటు కేఎస్ భరత్, శుభ్‌మాన్ గిల్, షమీ, రవీంద్ర జడేజా లండన్ చేరుకున్నారు. యువ ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ లో చోటు దక్కింది. తాజా రిపోర్టుల ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మరొకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌ను రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంచుకున్నారు. ఎందుకంటే గైక్వాడ్‌కు జూన్ 3న వివాహం జరగబోతుంది. ఈ కారణంగా అతడు భారత జట్టుతో జూన్ 5 తర్వాతే కలవనున్నాడు. దీంతో అతడి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వికి అవకాశం కల్పించారు సెలక్టర్లు. స్టాండ్ బై ప్లేయర్స్ లిస్టులో జైస్వాల్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడనున్నాడు.
ఇక ఆస్ట్రేలియా జట్టు కూడా ఇంగ్లాండ్ చేరుకుంది. టీంలో సమర్ధవంతమైన ఆటగాళ్లు ఉన్నా..ఐపీఎల్ లో భారత ఆటగాళ్ల సామర్ధ్యం చూసిన తరువాత కొత్త లెక్కలు వేస్తోంది. ఆసీస్ బ్యాటింగ్ లో స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్ మీద ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ ముగ్గురితో పాటుగా డేవిడ్ వార్నర్ కూడా ప్రమాదకరమైన బ్యాటర్. ఈ నలుగురు క్రీజులో కుదురుకుంటే ఇండియాకు కష్టాలు తప్పవనే అంచనాలు ఉన్నాయి. ఆసీస్ పేస్ విభాగంలో కీలకమైన ఆటగాళ్లుగా ఉన్న పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్ ఆసీస్ బలం. భారత జట్టుకు రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం.. హార్ధిక్ పాండ్యా కూడా అందుబాటులో లేకపోవడం భారత్ కు నష్టం కలిగించే అంశం.
భారత్ కూడా మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్ ల రూపంలో మంచి పేస్ అటాక్ ను కలిగి ఉన్నారు. దీంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర సమరం తప్పేలా లేదు. భారత జట్టు బౌలర్లు సిరాజ్, శార్దూల్, అక్షర్, ఉనాద్కట్, ఉమేశ్ కూడా ఇంగ్లాండ్ చేరుకున్నారు. టీమిండియా అరుండెల్ క్యాసిల్ క్రికెట్ క్లబ్లో ప్రాక్టీస్ షురూ చేసింది. ఐపీఎల్లో ఆడి ఉన్నందున గ్రౌండ్ ఫీల్డింగ్‌కు సంబంధించి ప్రాక్టీస్ అవసరంలేదని, అందువల్ల స్లిప్పులలో క్యాచ్‌లపై సాధన చేస్తున్నట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ వెల్లడించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు అలవాటు పడేలా బ్యాటర్లను సిద్ధం చేస్తున్నట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ చెప్పాడు. ఫైనల్‌కు తుది జట్టులో కీపర్‌గా ఇషాన్ కిషన్‌కు బదులు కేఎస్ భరత్‌ను ఎంపిక చేయడంలో రెండో ఆలోచనే ఉండబోదని జాతీయ మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ పేర్కొన్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో విజేతగా నిలిచిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.13.22 కోట్లు) బహుమతిగా అందుతుంది. ఇక రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు ( భారత కరెన్సీలో రూ.6.5 కోట్లు) అందుతుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఈ ప్రైజ్‌మనీని సొంతం చేసుకోనున్నాయి. 2023 డబ్ల్యూటీసీ సీజన్ సైతం 2021 లాగే 3.8 మిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. దీంతో రెండు హేమా హేమీ జట్లు నువ్వా నేనా అని తల పడుతున్న ఈ మ్యాచ్ కోసం రెండు దేశాలతో పాటుగా క్రికెట్ అభిమానులు వేచి చూస్తున్నారు.