Suriya:కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు హీరో సూర్య (Suriya). తండ్రి శివ కుమార్‌తో కలిసి పేద విద్యార్థుల కోసం `అగరం ఫౌండేషన్`(agaram Foundation)
Suriya:కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు హీరో సూర్య (Suriya). తండ్రి శివ కుమార్‌తో కలిసి పేద విద్యార్థుల కోసం `అగరం ఫౌండేషన్`(agaram Foundation)ని స్థాపించి ఎంతో మందికి చదువు చెప్పిస్తున్నారు. అందుకు కావాల్సిన ఖర్చులు భరిస్తూ ఎంతో మందికి చేయూత నిస్తున్నారు. ఆ మధ్య జరిగిన అగరం ఫౌండేషన్ కార్యక్రమంలో ఓ విధ్యార్థిని గాధ విని కన్నీళ్లు పెట్టుకున్న సూర్య తాజాగా తన అభిమాని కోసం భావోద్వేగానికి లోనయ్యారు.
ఇటీవల టెక్సాస్ నగరంలోని ఓ మాల్లో కాల్పుల ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఐశ్వర్య తాటికొండ అనే యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఐశ్వర్య అకాల మరణం ఆమె కుటుంబ సభ్యులని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో తన అభిమాని అయిన ఐశ్వర్య మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న హీరో సూర్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఐశ్వర్య చిత్ర పటం వద్ద పూలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం ఐశ్వర్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓ లేఖ రాశారు. అది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. `మీ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో నాకు మాటలు రావడం లేదు. ఐశ్వర్య మృతి తీరని లోటు. టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మీ కుమార్తె ఐశ్వర్య కన్నుమూయడం దురదృష్టకరం. ఆమె ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటుంది. ఒక దృవతార ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది` అంటూ ఐశ్వర్య తల్లిదండ్రుల్ని సూర్య ఓదార్చే ప్రయత్నం చేశారు.
అంతే కాకుండా `ప్రియమైన ఐశ్వర్య..ఇవి నీ మృతికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు. నువ్వు నిజమైన హీరోవి. నీ స్నేహితుల, కుటుంబ సభ్యులకు నువ్వొక ధృవతారవి. నువ్వు చిందించే చిరునవ్వు..నీలో ఉన్న ప్రేమను పంచే వ్యక్తిత్వం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది. నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి` అని సూర్య లేఖలో పేర్కొన్నారు. ఆయన రాసిన లేఖ, అభిమాని ఫొటో ముందు పుష్పగుచ్చం పెట్టి సూర్య శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
హీరో సూర్య ప్రస్తుతం తన 42వ మూవీ `కంగువ`లో నటిస్తున్నారు. సిరుతై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ మోషన్ పోస్టర్‌తో పాటు టైటిల్ ని మేకర్స్ విడుదల చేశారు. పీరియాడిక్ స్టోరీతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాని పది భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
#Aishwarya ( an Ardent #Suriya fan) who was shot in the Allen Mall shooting in Texas..💔 Heartrending words from @Suriya_offl grieving the loss of his passionate fan and writing an emotional letter to the family. pic.twitter.com/6IsMNb6btM
— Laxmi Kanth (@iammoviebuff007) May 19, 2023