అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సీబీఐ అడ్డంకులు తొలగిపోయాయా? కర్నూలులో ఉన్న సీబీఐ అవినాశ్ ను అదుపులోకి తీసుకుంటుందా?
Avinash Reddy : కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (Avinash Reddy)కి సుప్రీంకోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. అవినాశ్ ముందస్తు బెయిల్ (Bail)పై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టు (High Court) వెకేషన్ బెంచ్ (Vecation Bench) ముందు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాశ్ ముందస్తు బెయిల్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు తెలిపింది. అంతవరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐ (సీబీఐ) కి అదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయి ల్ పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తన తల్లికి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు వారం రోజుల పాటు మినహాయింపు ఇవ్వాలని కూడా అవినాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 6న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చేవరకు అరెస్టు చేయకుండా ఆదేశించాలని, లేదంటే ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించాలని ఆదేశించి అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులివ్వాలని అని అవినాశ్ అభ్యర్థించారు. ఈ హత్య కేసు దర్యాప్తును ట్రయల్ కోర్టు పర్యవేక్షించవచ్చా.. లేదా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్‌ను ఆయన దరఖాస్తుతో కోర్టు జత చేసింది. ఈ రెండింటినీ కలిపి మంగళవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన వెకేషన్ ధర్మాసనం ఎదుట 36వ విచారణ కేసుగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చేర్చింది.
ఇక అరెస్టేనా?
సుప్రీం తీర్పుతో అవినాశ్ రెడ్డి అరెస్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. తల్లి చికిత్ప పొందుతున్న కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న అవినాశ్ ను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చన్న వార్తలు మొదలయ్యాయి? సోమవారం అవినాశ్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. ఆయన అనుచరులు అడ్డుకోవటం, ఆందోళనలు జరిగి లా అండ్ ఆర్డర్ సమస్య లు తలెత్తే అవకాశమున్నందున జిల్లా ఎస్పీ సీబీఐ అధికారులకు నచ్చ చెప్పారు. ఈ లోగా అవినాశ్ సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయటంతో సీబీఐ అధికారులు వేచి చూసే ధోరణి ప్రారంభించారు. అయితే ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో