Supreem on Gangireddy Bail: వివేకా (Viveka) హత్య (Murder) కేసు (Case)లో నిందితుడు ఎర్రగంగిరెడ్డి (GangireddY)కి సుప్రీం కోర్టు (Supreem Court) షాక్ ఇచ్చింది. తెలంగాణ (Telangan)హై కోర్టు (High Court) ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే (Stay)ఇచ్చింది. వివేకా హత్య కేసును ఇప్పటికే ముగించాలని సూచించిన సుప్రీం కోర్టు ఎర్రగంగిరెడ్డి బెయిల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలంటూ గతంలో హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో సునీత దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ విచారించింది. బుధవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం బెంచ్ తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ జులై 14కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
8వ వింత… సుప్రీం ధర్మాసనం
బెయిల్‌ను రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ (DY Chandrachud) తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ఇవి ఎలాంటి ఉత్తర్వులు అంటూ తల పట్టుకున్నారు. ఈ క్రమంలో విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేసిన సీజేఐ ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదంతాలున్నాయని, సాక్ష్యులను బెదిరించే అవకాశాలు ఉన్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.