Sukesh Chandrasekhar: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) జైలు నుంచి వరుసగా లేఖలు (Letters) విడుదల చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు.
Sukesh Chandrasekhar: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) జైలు నుంచి వరుసగా లేఖలు (Letters) విడుదల చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలపై (MLC Kavitha) సంచలన ఆరోపణలు చేస్తూ లేఖలు విడుదల చేసి ప్రకంపనలు సృష్టించారు. తాజాగా మరో లేఖను సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాస ఖర్చులపై లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జైలు ల్యాండ్‌లైన్ ఫోన్‌ను ట్యాంపర్ చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తనవాళ్లకు ఫోన్ చేసిన సమయంలో హెడ్ కానిస్టేబుల్, జైలు అధికారులు పక్కనే ఉంటారని వెల్లడించారు.
తాను తన తల్లి అధీకృతకు తప్ప ఎవరికీ జైలు నుంచి ఫోన్ చేయలేదని వెల్లడించారు. తాను ఇతరులకు ఫోన్ చేసినట్లు ఆరోపిస్తున్న కేజ్రీవాల్ దానిని నిరూపించాలని సవాల్ విసిరారు. నిజంగా తాను తప్పు చేసినట్లు రుజువైతే కోర్టు ఎటువంటి శిక్ష విధించినా తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఒక వేళ నిరూపించకపోతే కేజ్రీవాల్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు బయట పెడుతున్నందుకే తనను వేధిస్తున్నారని సుశేఖ్ వెల్లడించారు. తనను మానసికంగా ఒత్తిడికి గురి చేయడం కోసమే మండోలిలోని 11వ జైలుకి తరలించారని.. తనను తరలించడంలో జైలు సూపరిండెంట్ ఓం ప్రకాష్ కీలకపాత్ర పోషించారని ఆరోపించారు.
అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఫర్నీచర్‌కి అయన ఖర్చునంతా తానే భరించానని సుఖేష్ చంద్రశేఖర్ వెల్లడించారు. అందుకు సంబంధించిన బిల్లులు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత షెల్ కంపెనీల అకౌంట్స్ నుంచి మారిషస్‌లోని కైలాష్ గెహ్లాట్ బంధువుల అకౌంట్లకు నగదు బదిలీ చేశానని.. కేజ్రీవాల్ సూచనల మేరకే రూ. 80 కోట్లను ట్రాన్స్ఫర్ చేశానని తెలిపారు. ఇందుకు సంబంధించి కేజ్రీవాల్‌తో ఫేస్‌టైమ్ చాట్స్ వివరాలను కూడా త్వరలో విడుదల చేస్తానని చెప్పారు. అతి త్వరలోనే మరో కుంభకోణాన్ని బయట పెడుతానని సుఖేష్ చంద్రశేఖర్ వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను జైలులో చూడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.