మామిడి పండును నేరుగా తింటున్నారా? అయితే ముప్పు తప్పదు.
Mangoes: మామిడి పండ్లు (Mangoes) మార్కెట్లో కుప్పలుగా పోసి అమ్ముతున్నారు (selling). వాటిని చూస్తుంటేనే నోరూరిపోతుంది. అప్పటికప్పుడే కొని తినేసేవారు కూడా ఎంతోమంది. కానీ పోషకాహార నిపుణులు (Nutrition) చెబుతున్న ప్రకారం మామిడిపండును నేరుగా తినకూడదు. తినడానికి ఒక అరగంట ముందు నీళ్ళల్లో నానబెట్టి (Soaking in water) ఆ తర్వాతే తినాలి. పూర్వం ప్రజలు ఇలాగే తినేవారు. ఇలా తినడం వెనుక ఎన్నో శాస్త్రీయ (Scientific) కారణాలు ఉన్నాయి.
మామిడిపండును తినడానికి కనీసం ఒక అరగంట ముందు నీటిలో నానబెట్టి ఆ తర్వాత తినేవారు పూర్వం. అలా చేయడానికి అసలు కారణం మామిడిపండ్లలో ఉత్పత్తి అయ్యే ఫైటిక్ యాసిడ్. కూరగాయలు, పప్పులు, ధాన్యాలు ఇలా అన్నింట్లోనూ ఈ ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. అందుకే వాటిని కూడా వండడానికి ముందు నీటిలో నానబెట్టాలి. అలా నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్లు విచ్ఛిన్నమైపోతాయి. అలా నానబెట్టకుండా తింటే శరీరంలో అధిక వేడిని ఉత్పత్తి చేస్తాయి. నీటిలో నానబెట్టడం వల్ల ఆ వేడంతా నీరు పీల్చేసుకుంటుంది.
మామిడిపండ్లు నీళ్లలో నానబెట్టడం వల్ల తొక్కలపై ఉండే బ్యాక్టీరియాలు, వైరస్లు కూడా తొలగిపోతాయి. లేకుంటే వాటి వల్ల ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. మామిడి తొక్క పై కంటికి కనిపించని స్థాయిలో నూనె కూడా ఉంటుంది. అది కూడా తొలగిపోతుంది. తొక్క పైన ఉండే నూనె శరీరంలో దురద రావడానికి కారణం అవుతుంది. మామిడి పండ్లు నానబెట్టడం వల్ల ఇవన్నీ నీటి ద్వారా బయటికి పోతాయి.
సాధారణ పండు కన్నా నీటిలో నానబెట్టిన పండు అధిక రుచిని కలిగి ఉంటుంది. పండ్లను ఫ్రిజ్లో పెట్టినా సరే బయటికి తీసాక తినే ముందు ఒక అరగంట పాటు నీళ్లలో పెట్టండి. తర్వాతే తినండి. దీనివల్ల మంచి సువాసన కూడా వస్తుంది. సహజమైన తీపి, సువాసన పెరుగుతుంది. పండు తేమవంతంగా తయారవుతుంది.
మామిడి పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తహీనత సమస్య బారిన పడిన వారు మామిడి పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిస్ రోగులు మాత్రం రోజుకు ఒక పండు కన్నా అధికంగా తినకపోవడమే మంచిది.