నువ్వులను తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. కానీ వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Sesame seeds: ఒకప్పుడు నువ్వులకు (Sesame seeds) వంటింట్లో (Kitchen) చాలా ప్రాధాన్యత ఉండేది. కచ్చితంగా వాడే దినుసుల్లో నువ్వులు కూడా ఒకటిగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నువ్వులను (Sesame) వాడే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. నువ్వుల వంటకాలు (Food) కూడా తగ్గిపోయాయనే చెప్పొచ్చు. నువ్వుల ఉండలు (sesame laddoo) చేసుకుని తినే వారి సంఖ్య చాలా తక్కువ. నువ్వులు, బెల్లం కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆయుర్వేదంలో కూడా నువ్వులకు ప్రముఖ స్థానమే ఉంది. నువ్వుల నూనె వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేదం కూడా నొక్కి చెబుతోంది. వీటిలో అనేక పోషకాలు ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు రెండు నుంచి మూడు స్పూన్ల నువ్వులను తింటే ఆరోగ్యానికి అంతా మంచే జరుగుతుంది. వీటిలో మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 9 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అందుతాయి.
గుండె ఆరోగ్యానికి…
నువ్వులు తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి నువ్వుల్లోని పోషకాలు సహకరిస్తాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా ఈ చిన్న గింజలు రక్షిస్తాయి. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు, కీళ్లవాతంతో ఇబ్బంది పడేవారు నువ్వులను ఆహారంగా మార్చుకోవాలి. అలాగే అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వారు కూడా నువ్వులను తినడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడతాయి.
కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి కూడా నువ్వులకు ఉంది. కాబట్టి రోజుకో స్పూను నువ్వులు కచ్చితంగా తినాలి. దీనిలో ఉండే కాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా చేస్తుంది. శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. చర్మానికి జుట్టుకు కూడా సౌందర్యాన్ని ఇస్తుంది. పిల్లలకు నువ్వులతో చేసిన ఆహారం తినిపించడం చాలా ముఖ్యం. అది వారి శరీర అభివృద్ధికి చక్కగా సహకరిస్తుంది. ఇక మహిళలు నువ్వులుతో చేసిన వంటకాలు తింటే రుతుస్రావ సమస్యలు తగ్గుతాయి. పొట్టనొప్పి, నడుము నొప్పి వంటి నెలసరి సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. నువ్వులు, బెల్లం కలిపి లడ్డూల్లా చేసుకుని రోజుకో లడ్డు తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. పిల్లలకు, మహిళలకే అధికంగా రక్తహీనత సమస్య వస్తుంది. కాబట్టి వారే ఇలా నువ్వుల లడ్డూని తింటే మంచిది. వంటలను నువ్వుల నూనెతో చేసుకుంటే శరీరం శక్తిమంతంగా తయారవుతుంది. అందుకే బాలింతలకు నువ్వుల నూనెతో వండిన వంటకాలనే తినిపిస్తారు. శరీరాన్ని సంరక్షించడంలో నువ్వుల నూనె ముందుంటుంది. నువ్వుల నూనెతో వండిన వంటకాలు తినడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఒక స్పూన్ నువ్వులను నోట్లో వేసుకొని నమిలి మింగితే ఎంతో మంచిది.