సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక మహేష్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తున్నారు. మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో స్టార్ హీరో అక్షయ్ కుమార్(akshay kumar) ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అక్షయ్ కోసం త్రివిక్రమ్ ఒక బలమైన పాత్ర రాశాడని టాక్ వినిపిస్తుంది. అయితే అది విలన్ పాత్ర.. లేక ఇంకోటా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ ను వేస్తున్నారట. ఇక జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సెట్ లో షూటింగ్ జరగనుంది. SSMB28 లో మహేష్ బాబు సరసన పూజ హెగ్దే, శ్రీలీల హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న SSMB 28 నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ రానుందని తెలుస్తోంది.
అందులో భాగంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించనుందట మూవీ టీమ్. దీనికి తోడు ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఈ గ్లింప్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు లుంగీతో మాస్ లుక్‌లో అదరగొట్టనున్నారని టాక్. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా టైటిల్ విషయంలో కాస్త సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సస్పెన్స్‌ను ఈ నెల 31తో తెరదించనున్నారని టాక్ వినిపిస్తుంది .ఈ సినిమాకు“అమరావతికి అటు ఇటు” అనే కూల్ టైటిల్ ఖరారు అయ్యిందని ఇన్ సైడ్ వర్గాల నుంచి సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది.
ఇక్కడ మరో విషయం ఏమంటే.. SSMB28 సినిమా షూటింగ్ విషయంలో మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని లేటెస్ట్ సోషల్ మీడియా టాక్. మహేష్, త్రివిక్రమ్ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విషయంలో మొదటినుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇక గత షెడ్యూల్ కూడా సరిగా రాలేదని.. దీంతో మరోసారి రీషూట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా విషయంలో మరో రూమర్ ఏమంటే.. ఈ సినిమాకు పూజా హెగ్డే (Pooja Hedge ) హీరోయిన్ గాను మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వద్దని మహేష్ చెప్పినప్పటికి త్రివిక్రమ్ తనని కన్విన్స్ చేశారని టాక్. అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా కొన్ని విభేదాలున్నాయని టాక్. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని వస్తున్న వార్తల విషయంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ స్పందించారు. అలాంటిదేమి లేదని అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ సినిమాలో ఓ క్రేజీ సిస్టర్ రోల్ ఉంటుందట. ఈ సినిమా కథ మొత్తం ఓ సిస్టర్ క్యారెక్టర్ చుట్టూ సాగుతుందని.. పైగా సినిమాలోనే ఈ సిస్టర్ పాత్ర చాలా కీలకమైనదట. దీంతో ఈ పాత్ర కోసం సాయి పల్లవిని పరిశీలిస్తున్నారట మూవీ టీమ్. SSMB28 బృందం జూలై నాటికి షూట్‌ని పూర్తి చేయలేకపోవడంతో ఈసినిమాను సంక్రాంతికి వాయిదా వేశారు. ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటికే సంక్రాంతిబరిలో Project K కూడా ఉంది..
ఇక ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రకటన చేసింది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఓ రేంజ్లో ఊహించుకుంటున్నారు. అయితే అదే రేంజ్లో ఈ సినిమాకు మార్కెట్ జరుగుతోందట. ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు ఓవర్ సీస్ రైట్స్ కోసం 23 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.వీటితో పాటు కేవలం దక్షిణాది నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్‌కు 100 కోట్ల వరకు కోట్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ప్రముఖ ఓటిటి సంస్థల ప్రతినిధులతో చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఇక హిందీ డబ్బింగ్‌తో పాటు డిజిటల్ రైట్స్ మాత్రం ఓ ముఫై కోట్ల రేంజ్ పలకొచ్చని తెలుస్తోంది. ఇక ఆడియో రైట్స్‌కు ఓ ఐదు కోట్లు డిమాండ్ చేయనున్నారట.
థియేటర్ హక్కుల విషయానికి వస్తే నైజాం ఏరియాకే దాదాపుగా ఓ 45 కోట్ల రేంజ్లో కోట్ చేయవచ్చని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమా 42 కోట్లు వసూలు చేసింది. ఇక ఆంధ్ర 50 కోట్ల రేంజ్లో, సీడెడ్ 20 కోట్ల రేంజ్ ఉండనుందని సమాచారం. మొత్తంగా 260 నుంచి 280 వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల మాట.ఇక మహేష్ – త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక పదకొండు సంవత్సరాల తరువాత (Mahesh Babu) మహేష్- త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్నారు.
ఇక మరోవైపు (Trivikram Srinivas) త్రివిక్రమ్ … ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను చేసి మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా కూడా హారికా హాసిని బ్యానర్‌పై నిర్మించనున్నారు. హీరోగా మహేష్ బాబుకు (Mahesh Babu) ఇది 28వ చిత్రం. అంకుల్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ కారెక్టర్ త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని.. కచ్చితంగా మహేష్ బాబు, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. మోహన్ బాబు నటించబోయే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతుంది. అంతేకాదు ఈ మూవీలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు టాక్. గతంలో త్రివిక్రమ్.. నదియా, కుష్పూ వంటి సీనియర్స్ హీరోయిన్స్‌ను మరోసారి టాలీవుడ్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కోవలో శోభనను కూడా ఈ సినిమాలో పాత్ర కోసం ఒప్పించినట్టు సమాచారం.
SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో . ఈ సినిమాకు ఆరంభం, అమ్మకథ, అమరావతికి అటు ఇటు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని టాక్ నడుస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జనవరి 13న విడుదల కానున్నట్లు తాజాగా టీమ్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్, దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో (SSMB29) ఓ భారీ సినిమాను చేయనున్నారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కారణంగా వరల్డ్ వైడ్‌గా ఓ రేంజ్లో క్రేజ్ మరింతగా వస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఇక లేటెస్ట్గా ఈ సినిమా లాంఛింగ్‌కు ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది. ఈ సినిమాను జూన్‌లో గ్రాండ్‌గా లాంఛ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి వుంది.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందుతోంది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథని రెడీ చేస్తున్నారట. రాజమౌళి ఈ సినిమాని అందరి అంచనాలు మించేలా ప్లాన్ చేస్తున్నారని.. ఈ మూవీలో మెసేజ్‌లు వంటివి ఏమి ఉండవని, ఇంటిల్లిపాది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే మూవీగా ఉంటుందని అంటున్నారు ఈ సినిమా రైటర్ విజయేంద్రప్రసాద్. అంతేకాదు ఈసారి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌లో ఒకటి కాదు.. 10- 15 నామినేషన్లు వచ్చేలా ప్లాన్ చేయాలని అన్నారు. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటూ గత పదేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో ఇటీవలే జాయిన్ అయ్యారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది..
ఇక ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌తో షూట్ చేయనున్నారట. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళికి హాలీవుడ్లో మంచి పాపులారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్’లో కూడా షూటింగ్ చేస్తారట. ఇక మిగితా భాషాల్లో డబ్ చేస్తారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీంతో రాజమౌళి చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా హిందీ నటి దీపికా పదుకొనె ఫైనల్ అయ్యినట్టు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే xXx: ది రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించడంతో కొంత ప్లస్ అవుతుందని.. ఆమెను చిత్రబృందం ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఆఫ్రికా ఖండం నేపథ్యంలో ఒక భారీ సాహసంతో కూడిన థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై దర్శకుడు రాజమౌళి ఈ సినిమా నేపథ్యాన్ని వెల్లడించారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాను లోకం చుట్టిన వీరుడు నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళి తన పూర్తి సమయాన్ని మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసమే కేటాయించనున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ విషయమై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో డిస్కషన్స్ పూర్తి చేసి ఒక రూపు తీసుకొచ్చారట. రాజమౌళి ఇపుడు మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాను కూడా మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో తమిళ హీరో కమల్ హాసన్ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.