Sasanasabha Movie: ‘శాసనసభ’ సినిమా మోషన్ పోస్టర్ విడుదల
Sasanasabha Movie Motion Moster: రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో ఇంద్రసేన హీరోగా ఐశ్వర్యరాజ్ హీరోయిన్గా. సోని అగర్వాల్, హెబ్బాపటేల్, కీలకపాత్రల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకత్వంలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్‌పోస్టర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ ఇంద్రసేన 12 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రం ఆయనకు సెట్ అవుతుంది. ఇంద్రసేనతో పాటు టీమ్ అందరికి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను’ అన్నాడు .
హీరో ఇంద్రసేన మాట్లాడుతూ:గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ చిత్రంతో రచయిత రాఘవేంద్రరెడ్డి మంచి కమర్షియల్ కథ ఇచ్చాడు. ఈ శాసనసభ చిత్రం నా కెరీర్‌కు టర్నింగ్‌పాయింట్‌గా నిలుస్తుంది అని తెలిపాడు.
దర్శకుడు వేణు మడికంటి మట్లాడుతూ నిర్మాతలు భారీ ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తరువాత తెలుగు సినీ పరిశ్రమ బెస్ట్ హీరో ల్లో ఇంద్రసేన కూడా వుంటాడు అని అన్నాడు.