Sai Pallavi:రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన `ఆదిపురుష్ ఇటీవలే విడుదలై వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. సినిమాలోని పాత్రలు రామాయణంలోని కీలక పాత్రలని కించపరిచే విధంగా ఉన్నాయని, రావణ బ్రహ్మ క్యారెక్టర్లో నటించిన సైఫ్ అలీఖాన్ పాత్రని మలిచిన తీరు, హను మాన్ పాత్రతో చెప్పించిన మాస్ డైలాగ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
Sai Pallavi:రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన `ఆదిపురుష్ ఇటీవలే విడుదలై వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. సినిమాలోని పాత్రలు రామాయణంలోని కీలక పాత్రలని కించపరిచే విధంగా ఉన్నాయని, రావణ బ్రహ్మ క్యారెక్టర్లో నటించిన సైఫ్ అలీఖాన్ పాత్రని మలిచిన తీరు, హను మాన్ పాత్రతో చెప్పించిన మాస్ డైలాగ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా సినిమా గ్రాఫిక్స్ పై కూడా నెటిజన్లు ఘాటుగా స్పందించారు. రూ.600 కోట్లు ఖర్చు చేసి ఓ కార్టూన్ సినిమాని రూపొందించారుని, యుద్ధ సన్నివేశాల్లో వానర సైన్యాన్ని చూపించేందుకు `వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్`లోని పతాక ఘట్టాలని ఉపయోగించారని విమర్శలు వినినిపించాయి.
దీంతో `ఆదిపురుష్` అత్యంత వివాదాస్పద చిత్రంగా నిలిచింది. ఇదిలా ఉంటే రామాయణ ఇతిహాసం నేపథ్యంలో మరో సినిమా తెరపైకి రాబోతోంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో పాటు మరి కొంత మంది నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్‌తో `రామాయణ` పేరుతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించిన వర్క్ కరోనాకు ముందు నుంచే మొదలైంది. `దంగల్` ఫేమ్ నితీష్ తివారి ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారు.
ఇందులో రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా అలియా భట్ నటించనున్నారని కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రావణుడి పాత్రలో `కేజీఎఫ్` ఫేమ్ యష్ నటిస్తారని, ఇప్పటికే లుక్ టెస్ట్‌ని కూడా నిర్వహించారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై యష్ ఇంత వరకు స్పందించలేదు. కానీ ఇందులో రణ్ బీర్ కపూర్, అలియాభట్ సీతారాములుగా నటిస్తున్నారని మాత్రం కంగన స్టేట్మెంట్ ద్వారా స్పష్టమైంది. దర్శకుడు నితీష్ తివారీ వీరిద్దరిపై లుక్ టెస్ట్ కూడా ఇటీవల పూర్తి చేశారట.
అయితే అలియా భట్ మాత్రం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అలియా భట్ పలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ఆ కారణంగానే నితీష్ తివారీ `రామాయణ` నుంచి తను తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అలియా భట్ స్థానంలో సీత పాత్ర కోసం దక్షిణాది క్రేజీ హీరోయిన్ సాయి పల్లవిని ఫైనల్ చేసుకునే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ముందు ఈ ప్రాజెక్ట్ కోసం సాయి పల్లవినే సీతగా అనుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ ప్లేస్‌లో అలియాభట్ వచ్చి చేరింది.
రణ్‌బీర్ రాముడిగా నటించనుండటంతో సీత పాత్రలో అలియా అయితే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఆ కారణంగానే అలియాభట్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చిందని, తాజాగా వరుస హాలీవుడ్ ప్రాజెక్ట్‌లని కమిట్ కావడం వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అలియా స్థానంలో సాయి పల్లవిని ఫైనల్ చేస్తారట. ఇదిలా ఉంటే `రామాయణ`ని మూడు భాగాలుగా తెరపైకి తీసుకురావాలని అల్లు అరవింద్, మధు మంతెన ప్లాన్ చేస్తున్నారని, డిసెంబర్ నుంచి తొలి భాగం సెట్స్ పైకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.