రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది.
రోహిణి కార్తె(Rohini Karte) వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు (summer)ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో(summer) ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దిగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు(High temperature). మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి.మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె(Rohini Karte) ఏలా ఉంటుందో తేదీ. ఈ సంవత్సరం రోహిణి కార్తే(Rohini Karte 2023) మే 25 న ప్రారంభమై జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది.
రోహిణి కార్తె (Rohini Karte 2023)ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు , ఎండ తీవ్రతలు , అగ్ని ప్రమాదాలు , ఉక్కపోతలు ఉంటాయి.ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువ మట్టికుండ నీళ్ళు త్రాగడం , మజ్జిగా , పండ్ల రసాలు , కొబ్బరినీళ్ళు , నిమ్మరసం , రాగి జావ , ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కొంత ఉపశమనం లభిస్తుంది. మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు , వేపుళ్ళు , పచ్చళ్ళు , ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు.నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయాలి.
ముఖ్యంగా సాటి జీవులైన పశు , పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయడం. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వడం. ఇలాంటి సంఘ సేవా కార్యక్రమాలు చేయడం వలన మీకున్న గ్రహభాదలు నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది.
కార్తెలు అంటే ఏంటి…?
జోతిష్యులు 27 నక్షత్రాలు, గ్రహాల ఆధారంగా పంచాంగాలు తయారు చేశారు. జాతకాలు నిర్ణయిస్తారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటారు. రైతుల లెక్కల ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. అలా సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు రైతులంతా తమ అనుభవం నుంచి సంపాదించుకున్న వ్యవసాయ విజ్ఞానాన్ని కార్తెలుగా వాటిని అందరకీ అర్థమయ్యేలా సామెతల రూపంలో అందరకీ అర్థమయ్యేలా చెప్పారు. అందులో ఒకటి రోహిణి కార్తె అని పేరు.
27 నక్షత్రాలే 27 కార్తెలు
1.అశ్వని, 2.భరణి, 3.కృత్తిక, 4.రోహిణి 5.మృగశిర 6. ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర 13.హస్త 14. చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జ్యేష్ట 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రావణ 23.ధనిష్ట 24.శతభిషం 25.పూర్వాభాధ్ర 26.ఉత్తరాభాధ్ర 27.రేవతి
వ్యవసాయ పనులు ప్రారంభం
వానలు సరైన సమయంలో పడితే రోహిణి కార్తెలోనే వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. దీంతో రైతులు పంటలు సాగు చేసేందుకు ముందుకు వస్తారు. రోళ్లు పగిలే ఎండలతో ఉక్కిరిబిక్కిరి చేసి రోహిణి కార్తెతో ఎండాకాలం అంతమైపోతుంది. దీని తరువాత ఒక్కో కార్తె వస్తూ ఉంటుంది. ఇలా వ్యవసాయ దారాలు ఒక్కో కార్తెలో ఒక్కో రకమైన వ్యవసాయ పనులు చేస్తుంటారు.
ఈ 15 రోజులు జాగ్రత్తలు
ఎండలు మండే రోహిణి కార్తెలో పశువులు, పక్షులకు తాగేందుకు ఎక్కడిక్కకడ నీళ్లతొట్టెలు ఏర్పాటు చేయడం చాలా మంచిది. మీ ఇంటి చుట్టుపక్కలైనా మూగజీవాలకు నీళ్లు అందించడం వలన ఇదే సమయంలో గొడుగు, చెప్పులు, నీటి కుండ దానం ఇవ్వడంతో పాటూ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా మీకున్న గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు.