పార్టీని గాడిలో పెట్టగలిగితే రేవంత్ రెడ్డి అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది
Revanth Reddy:కర్ణాటకం ముగుస్తోంది. కొత్త ప్రభుత్వం (New Government) పీఠమెక్కుతోంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ (Hyderabad) వైపు మళ్లుతోంది. తెలంగాణా (Telangana) ఎన్నికల (Elections) మీద కన్ను పడుతోంది. ముఖ్యంగా కన్నడ (Kannada) సీమను కైవసం చేసుకున్న కాంగ్రెస్ (Congress) కదన కుతూహలం ప్రదర్శించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ (KCR)ని కట్టడి చేసేది తామేనని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయవచ్చు. అదే సమయంలో కమలానికి కర్ణాటక (Karnataka)లోనే అడ్డుకట్ట వేయడంతో ఇక తెలంగాణా(Telangana)లో తమకు పోటీ కాదని కాంగ్రెస్(Elections) నేతలు భావిస్తున్నారు. అయితే కర్ణాటకలో బీజేపీ ఓటమికి, కాంగ్రెస్ గెలుపునకు కీలకం స్థానిక నాయకత్వం. రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ (Congress)ని ఇద్దరు కీలక నేత (Leaders)లు ఒక్కటయ్యి నడిపిస్తే, బీజేపీ (BJP)కి నాయకుడే లేని స్థితిలో ఎన్నికల (Elcetions)కు వెళ్లాల్సిన స్థితి ఏర్పడింది. సిద్ధరామయ్య (Siddaramyya)సీనియారిటీ, డీకే శివకుమార్ (DK Sivakumar) దూకుడు కలిసి కాంగ్రెస్ పార్టీ కొత్త చరిత్ర రాసేందుకు కారణమయితే, ఎడ్యూరప్పని తొలగించి, పీఠం ఎక్కించిన బస్వరాజ్ బొమ్మై (Bommai) ప్రభావం కనిపించకపోవడం బీజేపీ(BJP)ని ఇరకాటంలో నెట్టింది. చివరకు కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కడంలో సిద్ధ-డీకే టీమ్ వర్క్ (Team Work)ఫుల్ రిజల్ట్స్(Results) ఇవ్వడంతో దేశమంతా కాంగ్రెస్(Congress)నేతల్లో ఊపు తెచ్చింది.
వరుసగా హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh), కర్ణాటక (Karnataka) గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ కి ఇప్పుడు అసలు సవాల్ మొదలవుతోంది. రాజస్తాన్ (Rajasthan), ఛత్తీస్ గఢ్ (Chattisghad)లో ప్రభుత్వాల(Government)ను నిలబెట్టుకోవడం ఎంత అవసరమో మధ్యప్రదేశ్ (Madhyapradesh) తో పాటుగా తెలంగాణాలోనూ పుంజుకోవడం అత్యంత కీలకం. మరి తెలంగాణాలో గట్టెక్కాలంటే కాంగ్రెస్ కి దిక్కెవరు అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సారధ్యాన కాంగ్రెస్ లో కదలిక వచ్చింది. కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ పార్టీలో సీనియర్లు మాత్రం తలోదారి అన్నట్టుగానే ఉన్నారు. ఎవరికి వారే తామే నాయకులం అన్నట్టుగా సాగుతున్నారు. అడపాదడపా ఐక్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా విబేధాలు తీవ్రంగా ఉన్నాయనే సంకేతాలు ప్రజల్లోకి పంపుతున్నారు. పైగా పార్టీలో నాయకుల మధ్యనే తీవ్ర విమర్శలు, అవినీతి ఆరోపణలు కూడా చేసుకుంటూ పార్టీ పరువు కూడా తీసుకుంటున్న తీరు తెలంగాణా కాంగ్రెస్ ని కకావికలం చేస్తోంది.
నిజానికి తెలంగాణా ఇచ్చిన నేతగా సోనియా గాంధీకి గుర్తింపు ఉంది. అయినా గానీ రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయానికి అది సరిపోలేదు. కేసీఆర్ ప్రభావం ముందు పని చేయలేదు. ఈసారయినా కేసీఆర్ (Kcr) హ్యాట్రిక్ (Hatrik) కొట్టకుండా నిలువరించాలని ప్రయత్నించాల్సిన కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధంగా తలోదిక్కు అన్నట్టుగా కనిపిస్తున్నారు. అలాంటి సమయంలో కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కోసం తన శక్తిమేరకు శ్రమిస్తున్నారు. నాయకులు కలిసి రాకపోయినా పార్టీ జెండా ప్రజల్లో నిలబడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాని ఫలితం కూడా కనిపిస్తోంది. రాజకీయంగా డీకే మాదిరిగానే రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా అనేక అవరోధాలు ఎదుర్కొన్నారు. పాలకపార్టీ నుంచి అడ్డంకులు చవి చూశారు. కేసులు (Cases),అరెస్టు (Arrest)ల వరకూ కూడా వెళ్లింది. అయినా మొక్కవోని పట్టుదలతో శివకుమార్ (Sivakumar)అనుకున్నది సాధించినట్టే తాను కూడా కాంగ్రెస్ (Congrss) జెండా (Jenda)ఎగురవేయగలనని రేవంత్ (Revanth)నమ్ముతున్నారు.
శివకుమార్(Sivakumar)వ్యూహాత్మకంగా మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నట్టుగా సాగడం ద్వారా సక్సెస్ (Success) అయ్యారు. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) పంథా కొంత భిన్నంగా ఉంటుంది. ఆయన మాటలే అత్యదిక సమయాల్లో చేటు తెస్తుంటాయి. అయినా గానీ తన ధోరణి మార్చుకోకుండా ముందుకు సాగడం రేవంత్ పట్టుదలను చాటుతోంది. అదే ఫలితాన్నిస్తుందా లేదా అన్నది చూడాలి. అందుకోసం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కూడా డీకే మాదిరిగా అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నప్పటికీ డీకే తొలుత స్థానికంగా తన రాష్ట్రంలో పార్టీ మీద పట్టు కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డికి కూడా కాంగ్రెస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. కానీ తెలంగాణా (Telangna)లో మాత్రం తగిన పట్టు లేదు. పార్టీ మీద పట్టు సాధించేందుకు రేవంత్ కి శివకుమార్ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. ఆయన నుంచి పాఠాలు (Lessions) నేర్చుకుంటే భవిష్యత్ (Future) కి మేలు చేస్తుందనే వాదన కూడా ఉంది.
రాజకీయంగా కర్ణాటక(Karnataka)లో కూడా గడ్డుస్థితిలో ఉన్నప్పుడే శివకుమార్(Sivakumar) సారధ్యం వహించారు. తెలంగాణాలో సైతం కాంగ్రెస్(Congress) ఆశలు కొడగొడుతున్న వేళ రేవంత్ రెడ్డి తెరమీదకు వచ్చారు. వరుసగా పాదయాత్రలు ,నిరుద్యోగ భేరీ వంటివి సక్సెస్ (Sucess) చేసి సామాన్యుల్లో సానుకూలత సాధిస్తున్నారు. అదే సమయంలో పార్టీని గాడిలో పెట్టగలిగితే రేవంత్ రెడ్డి అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ (Bjp)వైపు మళ్లకుండా తామే ఛాంపియన్ (Champion)అని నిరూపించుకోగలిగితే కాంగ్రెస్ బలం పెరగడానికి దోహదపడుతుంది. కర్ణాటకలో జేడీఎస్ (JDS) ని పరిమితం చేసినట్టే తెలంగాణాలో బీజేపీని పరిమితం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ సక్సెస్ అయితేనే కేసీఆర్ కోటలను బద్ధలు కొట్టే అవకాశం ఉంటుంది. అందుకు గానూ తొలుత బీజేపీలో అసంతృప్తులు, టీఆర్ఎస్ లో అసమ్మతులను తనవైపు తిప్పుకోవాలి. అలాంటి వ్యూహాలు రచించడంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy)సిద్ధహస్తుడు. కానీ అవి ఆచరణలో నిరూపించగలిగితేనే తొలుత పార్టీ(Party)లో, తర్వాత పబ్లిక్ (Public)లో ప్రత్యామ్నాయం నాయకుడిగా రేవంత్ ఎదిగే అవకాశం వస్తుంది. అందులో ఏమేరకు విజయవంతమయితే ఆమేరకు డీకే (DK)తరహా లీడర్ (Leader)గా ఎదగానికి ఆస్కారం ఏర్పడుతుంది..