ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహారంపై దుమారం ఇప్పట్లో ఆగేలా లేదు. ఆ టెండర్ల వ్యవహారం పెద్ద స్కామ్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Raventh Reddy : ఓఆర్ఆర్ (ORR) టెండర్లు (Tenders) నిబంధనలకు విరుద్ధమన్నారు తెలంగాణ పీసీసీ (Tpcc)చీఫ్ (Chief)రేవంత్ రెడ్డి (Revanth).. ఓఆర్ఆర్ టెండరును 30 ఏళ్లకు కట్టబెట్టారని , హెచ్ఎండీఏ (Hmda) మాస్టర్ ప్లాన్ (Master Plan) ప్రకారం అది చెల్లదని రేవంత్ అన్నారు. నిబంధన మార్చితే అది పెద్ద స్కామ్ (Scame) అవుతుందని అన్నారు రేవంత్ రెడ్డి. నిబంధనలను ఉల్లంఘించిన సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలని డిమాండ్ (Demand) చేశారు. ఒకవేళ ప్రభుత్వం టెండరు నిబంధనలు మార్చి ఉంటే ఆ విషయం చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం వంటిదేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మొదట చాలా కఠిన నిబంధనలతో రూపొందించారని, కానీ కల్వకుంట్ల కవిత, ఇతర సౌత్ నాయకులు రంగప్రవేశం చేసిన ఆ తర్వాత ఆ లిక్కర్ పాలసీలో మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో సీఎం కేజ్రీవాల్ కు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలపై ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నారని వివరించారు. కానీ, ఓఆర్ఆర్ టెండర్ల విషయం లక్ష కోట్లకు సంబంధించినదని, అంత విలువైన ఆస్తిని కేవలం రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారని తెలిపారు. దీనితో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నదని రేవంత్ పేర్కొన్నారు. ఇంత బాహాటంగా దోపిడీ జరుగుతుంటే బీజేపీ నేతలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారు… ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు నిర్వహించడంలేదు అని నిలదీశారు.