టెలీకమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి, ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది.
టెలీకమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి, ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ సమసమాజ స్థాపన కోసం కృషి చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో అత్యంత పిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాంధీ.
రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న పుట్టారు. సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో 1980లో దేశంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఆ సమయంలో తల్లి ఇందిరాగాంధీని అనేక సవాళ్లు చుట్టుముట్టిన నేపథ్యంలో రాజీవ్‌పై రాజకీయాల్లో చేరాల్సిందిగా ఒత్తిడి పెరిగింది. రాజీవ్ మొదట్లో ఇందుకు ఒప్పుకోకున్నా, తర్వాత ఉత్తరప్రదేశ్ లోని అమెథీ నుంచి పోటీ చేసేందుకు ఒప్పుకున్నారు. ఆ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. 1984 అక్టోబర్ 31న ప్రధాని ఇందిర దారుణ హత్యకు గురయ్యారు. దీంతో రాజీవ్ ప్రధానిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. తల్లి మరణం బాధపెడుతున్నా ఎంతో ఓర్పుతో బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. ప్రధాని అయ్యే సమయానికి ఆయన వయసు 40 ఏళ్లే. దేశ చరిత్రలో అందరి కంటే తక్కువ వయస్సులో ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. ప్రధాని అయ్యాక దేశ చరిత్రలో ఎన్నో కొత్త రికార్డులు నెలకొల్పారు. తల్లి అంత్యక్రియలు పూర్తికాగానే ఆయన లోక్ సభ ఎన్నికలకు ఆదేశించి ఘన విజయం సాధించారు. అంతకుముందు ఏడుసార్లు జరిగిన ఎన్నికల్లో కంటే రాజీవ్ హయాంలో ఎక్కువ సీట్లను సాధించారు.
టెక్నాలజీకి పెద్ద పీట
కంప్యూటర్ రంగాన్ని మన దేశానికి పరిచయం చేసి ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నేర్చుకునేలా చేసింది రాజీవ్ గాంధీనే. గ్రామాల అభివృద్ధికి రాజీవ్ ఎంతగానో కృషి చేశారు. ఐటీ రంగంలో ఈనాడు మనదేశం అగ్రగామిగా ఉందంటే అది రాజీవ్ కృషి ఫలితమే. ఆధునిక భావాలు కలిగిన వ్యక్తిగా.. అంతర్జాతీయంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు రాజీవ్ గాంధీ. అంతేకాదు తన నిర్ణయాలను నిర్భయంగా వెల్లడించేవారు. ‘భారతదేశంలో ఐక్యతను కాపాడుకుంటూనే మన దేశ ఐక్యతను 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడమే’ తన ధ్యేయమని రాజీవ్ చాలా సార్లు చెప్పారు. సోవియట్ యూనియన్ ‘ప్రొటెక్షనిస్ట్ గవర్నమెంట్’ విధానాలపై ఆధారపడిన అప్పటి ఆర్థిక నమూనాను విస్తృతం చేసే విధానాలు, సంస్కరణలను ప్రధానిగా రాజీవ్ ప్రవేశపెట్టారు.సాంకేతిక పరిశ్రమపై పన్నులను తగ్గించే సంస్కరణలను ప్రవేశపెట్టారు. టెలీకమ్యూనికేషన్స్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్థలకు సంబంధించిన దిగుమతి విధానాలను సంస్కరించారు. ఆయన విధానాలు ఆర్థిక వ్యవస్థలో అధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. రాజీవ్ తల్లి ఇందిరలా కాకుండా, సంప్రదాయ సోషలిజానికి వ్యతిరేకంగా ఉంటూ, పాశ్చాత్య దేశాలతో ఆర్థిక, శాస్త్రీయ సహకారాన్ని విస్తరించడం ద్వారా అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచారు.
రాజీవ్ గాంధీ హత్యకు ముందు జరిగింది ఇదే..?
రాజీవ్ గాంధీ హత్యకు కొన్ని గంటల ముందే అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ ఒక మాట అన్నారు. ‘‘అమెరికా అధ్యక్షుడిని ఎవరైనా చంపాలనుకుంటే అది పెద్ద విషయమేం కాదు. నన్ను చంపినందుకు ఆ హంతకుడు కూడా తన జీవితాన్ని వదులుకోవాలని నిర్ణయించుకోవాలి. అలా జరిగితే ప్రపంచంలోని ఏ శక్తీ నన్ను కాపాడలేదు. 1991 మే 21న రాత్రి పది గంటల 21 నిమిషాలకు తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో అలాగే జరిగింది. నల్లగా, బొద్దుగా 30 ఏళ్లున్న ఒక యువతి ఒక గంధపు మాల తీసుకుని భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వైపు కదిలింది. ఆమె ఆయన పాదాలను తాకేందుకు వంగగానే, చెవులు పగిలిపోయేలా ఒక పేలుడు సంభవించింది. ఆ సమయంలో వేదికపై రాజీవ్ గాంధీని గౌరవిస్తూ ఒక పాట ఆలపిస్తున్నారు.. ‘‘రాజీవ్ జీవితమే మా జీవితం… ఇందిరాగాంధీ కుమారుడికి సమర్పించని ఈ జీవితం జీవితమే కాదు.’’ అక్కడికి సుమారు 10 గజాల దూరంలో గల్ఫ్ న్యూస్ ప్రతినిధి, ప్రస్తుతం డెక్కన్ క్రానికల్, బెంగళూరులో స్థానిక సంపాదకులు అయిన నీనా గోపాల్ ఉన్నారు. రాజీవ్ గాంధీ సహచరుడు సుమన్ దూబేతో మాట్లాడుతుండగా జరిగింది.
అసలు బాంబు పేలడానికి ముందు జరిగింది ఇదే..!
“బాంబు పేలడానికి ముందు చిటపటమని టపాసులు పేలిన శబ్దం వచ్చింది, వెంటనే నిశ్శబ్దం ఏర్పడింది. తర్వాత భారీ శబ్దంతో బాంబు పేలింది. నేను ముందుకు పరిగెత్తా, అక్కడ ఉన్న వారి బట్టలకు మంటలు అంటుకున్నాయి. అందరూ అరుస్తున్నారు. భయంతో చుట్టూ పరుగులు తీసారు. రాజీవ్ గాంధీ ప్రాణాలతో ఉన్నారో, లేదో మాకు తెలియలేదు” అన్నారు నీనా. శ్రీపెరంబదూర్‌లో ఆ భయంకర పేలుడు సమయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు మూపనార్, జయంతి నటరాజన్, రామమూర్తి అక్కడ ఉన్నారు. పొగలు అలముకోవడంతో రాజీవ్ గాంధీ కోసం వెతకడం ప్రారంభించారు. ఆయన శరీరంలో ఒక భాగం, సగం తల కనిపించింది. ఆయన కపాలం ఛిద్రమైంది. దాని నుంచి బయటికొచ్చిన మెదడు, ఆయన సెక్యూరిటీ అధికారి పీకే గుప్తా కాళ్లపై పడి ఉంది. ఆయన కూడా అంతిమ ఘడియల్లో ఉన్నారు.
పేలుడు తర్వాత పరిస్థితి ఎలా వుంది అంటే..?
బాంబు పేలిన తర్వాత జీకే మూపనార్ ఒక చోట ఇలా రాశారు.. ” పేలుడు జరగగానే నేను పరుగులు తీయడం. నా ముందు శవాల భాగాలు పడి ఉన్నాయి. రాజీవ్ సెక్యూరిటీ అధికారి ప్రదీప్ గుప్తా అప్పటికి బతికే ఉన్నారు. ఆయన నావైపు చూశారు. ఏదో చెప్పాలనుకున్నారు, నా కళ్ల ముందే ప్రాణాలు వదిలారు. ఆయన రాజీవ్ గాంధీని ఎవరికో అప్పగించాలని అనుకుంటున్నట్టు అనిపించింది. నేను ఆయన తల ఎత్తాలనుకున్నా. నా చేతికి మాంసం ముక్కలు, రక్తమే వచ్చింది. వాటిని ఒక టవలుతో కప్పేశాను” అన్నారు. మూపనార్‌కు కాస్త దూరంలోనే జయంతీ నటరాజన్ షాక్‌తో నిలబడి పోయారు. తర్వాత ఆమె కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారట.. “పోలీసులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాకు శవాలు కనిపిస్తున్నాయి. రాజీవ్ కనిపిస్తారేమోనని వెతుకుతున్నా. మొదట నాకు ప్రదీప్ గుప్తా కనిపించారు. ఆయన మోకాళ్ల దగ్గర.. నేలపై ముఖం ఛిద్రమైన ఒక తల కనిపించింది. నా నోటి నుంచి ‘ఓ మై గాడ్… దిస్ లుక్స్ లైక్ రాజీవ్’ అనే మాట వచ్చింది”.అక్కడే నిలబడ్డ నీనా గోపాల్ ముందుకు నడిచి కొన్ని నిమిషాల ముందు రాజీవ్ నిలబడ్డ చోటుకు వెళ్లారు. “నేను ఎంత దూరం వెళ్లగలనో, అంతవరకూ వెళ్లాను. అప్పుడు నాకు రాజీవ్ గాంధీ శరీరం కనిపించింది. నేను ఆయన లోటో బూట్లు చూశా, తర్వాత చేయి చూశా, దానికి గుచ్చీ వాచ్ ఉంది. కాసేపటి ముందు నేను కారు వెనక సీటులో కూర్చుని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నా, రాజీవ్ ముందు సీటులో కూర్చున్నారు. ఆయన మణికట్టు వాచీ తరచూ నా కళ్లకు కనిపిస్తూ వచ్చింది” అని నీనా చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.
10 గంటల 25 నిమిషాలకు 10 జన్‌పథ్‌లో జరిగింది..?
“అంతలోనే రాజీవ్ గాంధీ డ్రైవర్ నా దగ్గరకు వచ్చి కార్లో కూర్చోండి అన్నాడు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపొండి అన్నాడు. నేను ఇక్కడే ఉంటాను అనగానే, తను ఇక్కడ చాలా గందరగోళం జరగబోతోంది అన్నాడు. మేం బయల్దేరాం. రాజీవ్ శవాన్ని తీసుకెళ్తున్న ఆ అంబులెన్స్ వెనకే ఆస్పత్రికి వెళ్లాం.”
10 గంటల 25 నిమిషాలకు దిల్లీలో రాజీవ్ నివాసం 10, జన్‌పథ్ దగ్గర నిశ్శబ్దం అలుముకుంది. రాజీవ్ ప్రైవేట్ సెక్రటరీ విన్సెంట్ జార్జ్ చాణక్యపురిలో ఉన్న తన ఇంటి వైపు వెళ్లిపోయారు.ఆయన ఇంట్లోకి అడుగు పెట్టగానే, ఫోన్ రింగ్ వినిపించింది. అవతలి వైపు నుంచి ఆయనకు తెలిసిన ఒక వ్యక్తి “చెన్నైలో రాజీవ్ గాంధీ సభలో బాంబు పేలుడు జరిగిందని” చెప్పాడు.జార్జ్ మళ్లీ 10 జన్‌పథ్‌కు పరుగులు తీశారు, అప్పటికే సోనియా, ప్రియాంక కూడా పడుకోడానికి వెళ్లిపోయారు. అప్పుడే వాళ్లకు కూడా “ఏం కాలేదు కదా” అని ఫోన్లు వచ్చాయి. సోనియా ఇంటర్‌కామ్‌లో జార్జ్‌ను పిలిచారు. జార్జ్ ఆ సమయంలో చెన్నైలో పి.చిదంబరం భార్య నళినితో మాట్లాడుతున్నారు. వాళ్ల మాటలు పూర్తయ్యేవరకూ తను లైన్లోనే ఉంటానని సోనియా ఆయనతో అన్నారు.రాజీవ్ గాంధీ లక్ష్యంగా ఒక పేలుడు జరిగిందనే విషయాన్ని నళిని నిర్ధారించారు. కానీ సోనియాకు ఈ వార్త చెప్పడానికి జార్జ్ ధైర్యం చేయలేకపోయారు. 10 గంటల 50 నిమిషాలకు ఫోన్ మరోసారి మోగింది.
సోనియా గాంధీకి తెలియగానే …
రషీద్ కిద్వాయ్ సోనియా జీవిత చరిత్ర పుస్తకంలో ఇలా పేర్కొన్నారు.. “ఫోన్ చెన్నై నుంచి వచ్చింది. ఈసారి ఫోన్ చేసిన వారు తాము ఎలాగైనా మేడమ్ లేదా జార్జ్‌తో మాట్లాడాలని చెప్పారు. తను నిఘా విభాగానికి చెందిన వ్యక్తినని చెప్పారు. కంగారు పడిపోయిన జార్జ్ రాజీవ్ ఎలా ఉన్నారని ఆయన్ను అడిగారు. ఆ వైపు నుంచి ఐదు సెకన్లు మాట వినిపించలేదు. కానీ జార్జ్‌కి అతను అలాగే ఉండిపోతాడేమో అనిపించంది. దాంతో బొంగురుపోయిన గొంతుతో ఆయన గట్టిగా అరిచారు, “రాజీవ్ ఎలా ఉన్నారో చెప్పవేంటి?” అన్నారు. దాంతో ఫోన్ చేసిన వ్యక్తి “సర్, ఆయన మనకిక లేరు” అన్నాడు. ఆ తర్వాత లైన్ డెడ్ అయ్యింది.”మేడమ్, మేడమ్ అని అరుస్తూ ఇంటి లోపలికి పరిగెత్తారు జార్జ్. నైట్ గౌన్‌లో ఉన్న సోనియా వెంటనే బయటికి వచ్చారు. ఏదో జరగరానిది జరిగిందని ఆమెకు అర్థమైపోయింది.”సాధారణంగా ప్రశాంతంగా ఉండే జార్జ్, అలా ఇంతకు ముందెప్పుడూ కనిపించలేదు. జార్జ్ వణికిపోతున్న గొంతుతో “మేడమ్ చెన్నైలో ఒక దాడి జరిగింది” అన్నాడు.సోనియా ఆయన కళ్లలోకి చూస్తూ “ఈజ్ హీ అలైవ్” అని అడిగారు. జార్జ్ మౌనమే సోనియాకు జరిగిన ఘోరం గురించి తెలిసేలా చేసింది.”ఆ తర్వాత సోనియా నిశ్చేష్టులయ్యారు. 10 జన్‌పథ్ గోడలు మొదటి సారి సోనియా రోదించడం విన్నాయి. ఆమె ఎంత గట్టిగా ఏడ్చారంటే, అప్పుడప్పుడే బయట ఉన్న గెస్ట్ రూంలోకి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలందరికీ ఆ ఏడుపులు స్పష్టంగా వినిపించాయి. అక్కడ అందరికంటే ముందు రాజ్యసభ సభ్యుడు మీమ్ అప్జల్ వచ్చారు” అని రషీద్ ఆ పుస్తకంలో రాశారు.
హత్య వెనుక ఎల్టీటీఈ హస్తం
“సోనియా ఏడ్చిన శబ్దం బయట వరకూ వినిపించడం. ఆ సమయంలో సోనియాకు ఆస్తమా అటాక్ చాలా తీవ్రంగా రావడం. ఆమె దాదాపు స్పృహతప్పిపోయారు. ప్రియాంక ఆమె మందుల కోసం వెతకడం. కానీ అవి దొరకలేదు. ఆమె సోనియాను ఊరడించే ప్రయత్నం కూడా చేశారు. కానీ సోనియాపై ఆమె మాటలు ఎలాంటి ప్రభావం చూపించ లేకపోయాయి.’’ఈ కేసు విచారణ కోసం సీఆర్పీఎఫ్ ఐజీ డాక్టర్ డీఆర్ కార్తికేయన్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు.తర్వాత కొన్ని నెలల్లోనే ఈ హత్యారోపణలతో ఎల్టీటీఈకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు.ప్రధాన నిందితుడు శివరాజన్, ఆయన సహచరులు అరెస్ట్ కావడానికి ముందు సైనైడ్ తీసుకున్నారు.
ఏడాది లోపే చార్జిషీటు దాఖలు
“హరిబాబు కెమెరా నుంచి ఆ పది ఫొటోలు లభించడమే మొదటి విజయం అని చెప్పచ్చు. సాధారణ ప్రజల సూచనలు తీసుకోడానికి పత్రికల్లో ప్రకటనలు . ఒక టోల్ ఫ్రీ నంబర్ ద్వారా. మొత్తం 4 వేల టెలిఫోన్ కాల్స్ . ప్రతి కాల్‌నూ సీరియస్‌గా తీసుకున్నారు. అన్ని చోట్లా తనిఖీలు చేయడం ప్రారంభించారు. దాంతో త్వరగానే ఈ కేసులో సత్ఫలితాలు వచ్చాయి.. దీని కోసం తొలి రోజు నుంచే 24 గంటలూ విరామం తీసుకోకుండా వారమంతా పనిచేశారు. మొత్తం దర్యాప్తు మూడు నెలల్లో పూర్తైంది. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావడం ఆలస్యమైంది. అయినా హత్య జరిగిన ఏడాది లోపే మేం కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగలిగారు.”కొన్ని రోజుల తర్వాత సోనియా గాంధీ తను నీనా గోపాల్‌ను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
దుబయ్ సోనియాను ఎందుకు కలిసారు..?
“భారత రాయబార కార్యాలయం అధికారులు దుబయ్ ఫోన్ చేసి సోనియా నన్ను కలవాలని అనుకుంటున్నట్టు నాకు చెప్పారు. జూన్ మొదటి వారంలో . మా ఇద్దరికీ అది చాలా కఠినమైన కలయిక. అంతిమ ఘడియల్లో రాజీవ్ మూడ్ ఎలా ఉందని, ఆయన చివరిసారి ఏం చెప్పారని ఆమె నన్ను పదేపదే అడిగారు” అని నీనా గోపాల్ చెప్పారు.”నేను ఆయన మంచి మూడ్‌లో ఉన్నారని, ఎన్నికల్లో విజయం కోసం ఉత్సాహంగా ఉన్నారని” ఆమెకు చెప్పారు. ఆమె నా చేయి పట్టుకుని అలా ఏడుస్తూనే ఉండిపోయారు. ఆమె జయంతి నటరాజన్‌తో ఆ గల్ఫ్ న్యూస్ అమ్మాయి మీనా (నీనా బదులు మీనా అన్నారు) ఎక్కడుందని అడిగినట్టు నాకు తర్వాత తెలిసింది. జయంతీ నా వైపు వచ్చేందుకు వెనక్కు తిరిగింది. అప్పుడే ఆ పేలుడు జరిగింది” అని నీనా చెప్పారు.
రాజీవ్ మాటలు నిజం అయ్యాయి.. సోనియా ఎవరితో గొడవ పడింది..?
ఇందిరా గాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న పీసీ అలగ్జాండర్ తన “మై డేస్ విత్ ఇందిరాగాంధీ” అనే పుస్తకంలో “ఇందిరా గాంధీ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కారిడార్‌లో సోనియా, రాజీవ్ గొడవ పడడం తనకు కనిపించిందని” రాశారు. రాజీవ్ సోనియాతో “పార్టీ నన్ను ప్రధాన మంత్రిగా ప్రమాణం చేయాలని కోరుకుంటోంది” అన్నారు. సోనియా ఆయనతో అలా చేయద్దని చెప్పింది. “వాళ్లు నిన్ను కూడా చంపేస్తారు” అంది. దానికి రాజీవ్ “నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా” అన్నారు. ఏడేళ్ల తర్వాత రాజీవ్ చెప్పిన ఆ మాటలే నిజమయ్యాయి.
ఎడ్యుకేషన్ పాలసీ
జాతీయ సమైక్యత, సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ, కాలేజీ స్థాయిల వరకు విద్యను అందించడం లక్ష్యంగా 1968లో ఇందిర ప్రభుత్వం మొదటి నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టింది. అసమానతలను తొలగించడం, విద్యావకాశాల సమానత్వం, ముఖ్యంగా మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ 1986లో రాజీవ్ ప్రభుత్వం కొత్త నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టింది. రాజీవ్ ప్రభుత్వం 1986లో ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్ ను ప్రవేశపెట్టి, 1987లో దానిని ప్రారంభించింది. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వారి విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అవసరమైన సంస్థాగత పరికరాలు, బోధనా సామగ్రిని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. వంద మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులకు జీతం ఇవ్వాలనే నిబంధనను ఇందులో చేర్చింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని 1985లో రాజీవ్ సర్కారు ఏర్పాటు చేసింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ యాక్ట్ 1985ను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ‘దూర, బహిరంగ విద్య’ అందించడానికి ఇది ఏర్పాటైంది.
శ్రీలంక అంతర్యుద్ధంలో రాజీవ్ జోక్యం
మాల్దీవుల రిపబ్లిక్లో మౌమూన్ అబ్దుల్ గయూమ్ ప్రెసిడెన్సీకి వ్యతిరేకంగా 1980లో వరుస తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి. 1980, 1983లో రెండు ప్రయత్నాల తర్వాత అబ్దుల్లా లుతుఫీ ద్వారా మూడో ప్రయత్నం జరిగింది. గయూమ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగిన ఈ ప్రయత్నాన్ని ఎదుర్కొని మాలెలో పరిస్థితి పునరుద్ధరించడానికి ప్రధాని రాజీవ్ 1,600 పారాట్రూపర్లను అక్కడికి పంపారు. భారత సైన్యం ప్రెసిడెంట్ గయూమ్‌ను రక్షించింది. శ్రీలంక అంతర్యుద్ధంలో రాజీవ్ జోక్యం చేసుకున్నారని భావించిన ఎల్టీటీ ఈ తీవ్రవాదులు దారుణంగా హత్య చేశారు. దేశంలోని తమిళ పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల రాజీవ్ శ్రీలంకలోని తమిళులకు సహాయం అందించారు. రాజీవ్ అప్పటి శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనేతో ఇండో-ఎస్ఎల్ ఒప్పందంపై సంతకం చేశారు. అందులో, శ్రీలంకలో పరిస్థితిని అదుపు చేయడానికి, శాంతిని కాపాడే దళాన్ని పంపడానికి ఒక ఒప్పందం కుదిరింది. అయితే 1989లోఅధికారంలోకి వచ్చిన రణసింఘే ప్రేమదాస శ్రీలంక నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని మనదేశాన్ని కోరారు. దీని తర్వాత మనదేశం వెంటనే శ్రీలంక నుంచి వైదొలిగింది. అయినప్పటికీ ప్రతీకారంతో ఉన్న ఎల్టీటీఈ తీవ్రవాదులు 1991 మే 21న శ్రీపెరంబుదూర్ లో రాజీవ్ ను హత్య చేశారు. ఆయన వర్థంతిని “ఉగ్రవాద నిరోధక దివస్”గా, ఆయన జయంతిని “సద్భావన దివస్” గా ఏటా జరుపుకుంటున్నాం.