భారతదేశం ఎన్నో పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి చెందింది. ప్రకృతితో నిండిన ప్రదేశాలు, పర్వతాలు, ఎన్నో గుహలు, సొరంగాలు కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందాయి.
భారతదేశం ఎన్నో పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి చెందింది.(sorangam) ప్రకృతితో నిండిన ప్రదేశాలు, పర్వతాలు, ఎన్నో గుహలు, సొరంగాలు(sorangam) కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి గుహలు(guha), సొరంగాలు, భూమిలోని అద్భుతాలకు కొదవేలేదు. ఇలాంటి అద్భుతమైన దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు కూడా వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు. (Arjun Loddi)దట్టమైన అటవీప్రాంతంలో ఎత్తయిన గుట్టల మధ్యనున్నఅతిపెద్ద సొరంగం ఎప్పుడైనా చూశారా? ఆ సొరంగం చుట్టూ పచ్చని చెట్లు, కొలను ఇక్కడికి వచ్చే భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సొరంగం ఉద్యమకారులకు ఎంతగానో ఉపయోగిపడింది. ఇంత చరిత్ర కలిగిన ఈ సొరంగం ఇంతకీ ఎక్కడ ఉంది..?
ఇంతకి ఈ సొరంగం ఎక్కడ వుంది..?
అర్జున్లొద్ది(sorangam) గుహ ప్రాంతం ఆరాధన స్థలంగా ప్రసిద్ధి చెందింది. చుట్టూ దట్టమైన అడవులు, కొలను, జలపాతాలు ఎంతో ఆహ్లాదం పంచుతున్నాయి. తెలంగాణలోని కుమరంభీం(komarambeem) ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మెస్రంగూడ గ్రామ పంచాయతీకి సుమారు ఐదు కిలో మీటర్ల దూరంలోనున్న అర్జున్లొద్ది ప్రాంతం ఒక ఆరాధనస్థలంగా మారింది.
పంచపాండవుల్లో ఒకరైన అర్జునుడి ఆలయం
పంచపాండవుల్లో ఒకరైన అర్జునుడి(arjunudu temple) ఆలయం ఈ ప్రాంతంలో ఉంది. పూర్వం పాండవులు ఈ ప్రాంతంలో తిరిగారని, అర్జున్లొద్ది గుహల్లో బంగారు కిరీటాలను ఉంచారని ఇక్కడి గిరిజనుల నమ్మకం. అరణ్యవాస సమయంలో భీముడు గిరిజన స్త్రీని వివాహమాడి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని, తామంతా భీముడి సంతానమని ఇక్కడి వారు నమ్ముతారు. అందుకే, ఈ ప్రాంతంలోని గిరిజనులు ఎక్కువ శాతం భీముడు,అర్జునుడు పేర్లనే పెట్టుకుంటారు.
సొరంగం లోపల ఏమి కనిపిస్తుంది అంటే..?
సొరంగం లోపల ఆవు పొదుగులాంటి ప్రదేశం ఒకటి కనిపిస్తుంది. దాని కింద చేయిపెడితే అదృష్టవంతులకు క్షీరధారలు పడుతాయని అంటూ ఉంటారు. ఎత్తయిన కొండల నుంచి పరుపు బండలపై తెల్లటి పాల నురగలా చూడముచ్చటగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. గుహకు వెనుక భాగాన ప్రవహిస్తుంది. అక్కడ ద్రౌపతి స్నానం చేస్తుండేదని ఇక్కడి వారు చెబుతారు. ఈ ప్రాంతాన్నిఅందుకే కొలనుగా పిలుస్తారని వారి నమ్మకం. ఈ సొరంగం చూసేందుకు చాలామంది ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ చూడలేకపోయారు.ఇక్కడికి వెళ్లాలంటే ఖచ్చితంగా టార్చలైట్లు ఉండాల్సిందే. ఎందుకంటే ఈ ప్రాంతమంతా చీకటిగా ఉంటుంది. సరిగా ఊపిరాడదు. ఆ ఇబ్బందులతోనే చాలామంది వెనుదిరిగారని ఇక్కడి వారు అంటున్నారు. దీనిని ఎవరూ చూడలేకపోయారు కూడా. సొరంగం లోపలి భాగానికి వజ్రపు మెరుగు ఉంటుందని, ఒక స్తంభం అయితే దగదగలాడుతూ ఉంటుందని ఇక్కడి స్థానిక గిరిజనులు చెబుతూ ఉంటారు.
ఆరాధన స్థలంగా.. ఈ ప్రాంతం భక్తులకు ఒక ఆరాధన స్థలంగా మారింది. అందుకే, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ నుంచి ప్రజలు భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. ప్రతిఏటా ఈ ప్రాంతంలో సంస్కృతీ, సంప్రదాయం ప్రకారం ఆలయ వార్షికోత్సవాలను నిర్వహిస్తారు. ఇక్కడికి స్థానిక ప్రజాప్రతినిధులే కాకుండా నలుమూలల నుంచి గిరిజనులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా పొలాల్లో విత్తనాలు చల్లేటప్పుడు, పంటను కోసే ముందు గిరిజనులు ఈ సొరంగం వద్ద పండుగ చేసుకుంటూ ఉంటారు.