జ్యోతిష్య శాస్త్రంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బంగారాన్ని జ్యోతిషశాస్త్రంలో శుభ లోహం గా పరిగణిస్తారు. దేవతల లోహంగా కూడా భావిస్తారు.
జ్యోతిష్య శాస్త్రంలో బంగారానికి(gold) ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బంగారాన్ని జ్యోతిషశాస్త్రంలో(Astrology) శుభ లోహం గా పరిగణిస్తారు. దేవతల లోహంగా కూడా భావిస్తారు. ప్రపంచంలోనే అత్యంత బంగారాన్ని(gold) ఉపయోగించే దేశంలో భారత దేశం ఒకటి. బంగారం స్వచ్ఛతకు ప్రతీక .బంగారాన్ని ధరించడం చాలా శ్రేయస్కరం. బంగారాన్ని విభిన్న రూపాలలో గొలుసులు, ఉంగరాలు, బ్రాస్లెట్ లు వంటి ఆభరణాల రూపాలలో ధరించడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరు బంగారాన్ని ధరించాలి..?
బంగారం మనల్ని ధనవంతులు గానూ గౌరవనీయమైన వ్యక్తులుగానూ చేస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం(Astrology) ఎవరు బంగారాన్ని ధరించాలి? ఎవరు ధరించకూడదు? ఏ సందర్భాలలో బంగారాన్ని ధరించాలి? వంటి విషయాలను తెలుసుకుందాం. మేష,(mesha) కర్కాటక, (karkataka)సింహ(simha) లగ్నంలో పుట్టిన వారు, ధనస్సు (dhanassu)రాశి వారు బంగారాన్ని ధరించడం మంచిది. వృషభ, మిధున, కన్య, కుంభ రాశుల వారు బంగారాన్ని ధరించడం మంచిది కాదు అంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
సంతానం లేని వారు ఏ వేలుకి బంగారాన్ని ధరించాలి..?
జీవితంలో సంతోషంగా ఉండాలంటే మెడలో స్త్రీలు బంగారు ఆభరణాలను ధరించడం మంచిది. సంతానం లేకపోతే ఉంగరపు వేలుకు బంగారాన్ని ధరించాలి. బంగారం శరీరానికి కావలసిన శక్తిని, వేడిని ఉత్పత్తి చేయడం వల్ల ఇది జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది. బంగారాన్ని పొరపాటున కూడా నడుము విభాగంలో ధరించకూడదు. ఎందుకంటే బంగారాన్ని నడుం భాగంలో ధరిస్తే అది జీర్ణవ్యవస్థను, గర్భాశయాన్ని పాడుచేస్తుంది. వీటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి.
ఎవరు బంగారాన్ని ధరించకూడదు..?
ఊబకాయంతో బాధపడుతున్నవారికి కూడా బంగారాన్ని ధరించకూడదు. కోపం ఎక్కువగా ఉండేవారు, అసహనంతో ఉండేవారు, గట్టిగా మాట్లాడే వారు బంగారాన్ని ధరించకూడదు. గర్భిణి స్త్రీలు(pregnant women), వృద్ధులు ఎక్కువ బంగారాన్ని ధరించకూడదు. బంగారాన్ని పొరపాటున కూడా పాదాలకు ధరించకూడదు. బంగారం(gold) బృహస్పతి యొక్క లోహం కావడంతో, అది చాలా పవిత్రమైన లోహం గా పరిగణించబడుతుంది. ఎవరైనా పాదాలకు బంగారాన్ని ధరిస్తే వారి జీవితాల్లో వైవాహిక సమస్యలు వస్తాయట.
బంగారాన్ని ఎడమ చేతికి ధరిస్తే ఏమౌతుంది..?
ఇక ఎడమచేతికి బంగారాన్ని ధరించకూడదు. ఏదైనా ప్రత్యేక అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎడమ చేతికి బంగారాన్ని ధరించాలి. ఎడమ చేతికి బంగారాన్ని ధరిస్తే ఎక్కువ సమస్యలు వస్తాయి. బంగారాన్ని ధరించిన వారు మద్యాన్ని, మాంసాన్ని తీసుకోకూడదు. బంగారం బృహస్పతి యొక్క స్వచ్చమైన లోహం కావడంతో దాని స్వచ్ఛతను కాపాడుకోవాలి. అంతేకాదు ఇనుము, బొగ్గు లేదా శనికి సంబంధించి ఏదైనా లోహంతో వ్యాపారం చేసేవాళ్లు కూడా బంగారాన్ని ధరించకూడదు.