హైదరాబాద్ లో(hyderabad) కలకలం సృష్టించిన సరూర్ నగర్ అప్సర(apsara) హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్ లో అప్సర మృతదేహాన్ని(Apsara's) సాయి పడేశాడు. అయితే తన కూతురు కనిపించడం లేదని అప్సర తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులకుఆ సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని ప్రశ్నించగా పోలీసులకు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి.
హైదరాబాద్ లో(hyderabad) కలకలం సృష్టించిన సరూర్ నగర్ అప్సర(apsara) హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన పూజారి సాయిక్రిష్ణను(sai krsihna) పోలీసులు శనివారం ఉదయం హాజరు పరిచారు. దీనితో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా..సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా ఆలయంలో పూజారిగా ఉన్న సాయికృష్ణకు అప్సర (apsara)అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త శారీరక సంబంధంగా మారింది. అయితే అప్పటికే పెళ్లి అయిన సాయిక్రిష్ణకు(sai krsihna) భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ తనను పెళ్లి చేసుకోవాలని అప్సరా సాయికృష్ణపై ఒత్తిడి తీసుకొచ్చింది.
అంతా పథకం ప్రకారమేనా
దీనితో ఆమె అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమెను ఈనెల 3న కారులో తీసుకెళ్లి పథకం ప్రకారం తలపై దుడ్డు కర్రతో బాది చంపేశాడు. ఆ తరువాత అప్సర డెడ్ బాడీని(apsara ded body) మ్యాన్ హోల్ లో పడేశాడు. ఆ తరువాత దుర్వాసన రాకుండా ఒక బస్తా ఉప్పును అందులో పోశాడు. అంతేకాదు ఓ ట్రక్కు ఎర్రమట్టిని పరిచయం ఉన్న వ్యక్తులతో పోయించాడు. మరుసటి రోజు మ్యాన్ హోల్ దగ్గరకు వెళ్లిన సాయికృష్ణ దుర్వాసన రావడంతో సిమెంట్ తో ఆ మ్యాన్ హోల్ ను మూసివేశాడు. కానీ సీసీ ఫుటేజిలో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అవ్వడంతో అసలు విషయం బయటకొచ్చింది.
పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో ఏం తేలింది..?
అప్సరకు గతంలో గర్భం రాగా అబార్షన్ జరిగిందని(apsara pregent)..తాజాగా కూడా ఆమె గర్భవతిగా ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాకపోతే దీనికి సంబంధించి ఆధారాలు బయటకు రావాల్సి ఉంది. అయితే అప్సరకు మరికొంతమంది యువకులతో పరిచయం ఉందని సాయికృష్ణ చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది. అప్సర గర్భానికి కారణం తాను కాదని పోలీసులకు చెప్పగా..ఇవన్నీ కూడా ఆరోపణలని దర్యాప్తులో అసలు నిజాలు తెలుస్తాయని పోలీసులు చెప్పుకొచ్చారు.అయితే అప్సర పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో(Apsara’s Murder Case) అప్పటికే పెళ్లి కావడంతో సాయికృష్ణ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు కనుక . ఒకవేళ పెళ్లి చేసుకుంటే తమ వివాహేతర సంబంధం బయటకు తెలిసిపోతుందని..అప్పుడు పరువు పోతుందని గ్రహించిన సాయి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే పలువురు ధాతలు, ప్రముఖులతో సాయికి పరిచయాలు ఉండడంతో అదంతా పాడవుతుందని పక్కా పథకంతో ఆమెను మట్టుబెట్టాడు. ఇక అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గాని అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది.
అప్సర ఇంటికి కూరగాయలు, సరుకులు తెచ్చి ఇచ్చేవాడని..సాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అప్సరకు లేదని ఆమె తెలిపింది. తన భర్త కాశీలో ఉంటున్నాడని..అప్సరతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నట్టు అప్సర తల్లి తెలిపారు. ఇక అప్సర, సాయి తరచూ బైక్ లపై తిరిగేవారని..వారిద్దరూ కలిసి మెలిసి ఉండేవారని స్థానికులు చెప్పుకొచ్చారు. రోజూ అప్సర ఇంటికి సాయి వచ్చేవాడని స్థానికులు తెలిపారు. ఇక మరోవైపు అప్సర డెడ్ బాడీని మ్యాన్ హోల్ నుంచి తీసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కానీ ఇప్పటికీ అప్సర తల్లి ఆసుపత్రికి రాకపోవడంతో పోస్ట్ మార్టం స్టార్ట్ చేయలేదు. అప్సర తల్లి వస్తే గాని సంతకము తీసుకొని పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉందని సమాచారం.
Hyderabad: అప్సర మర్డర్ కేసులో సంచలన నిజాలు..యువతిని పూజారి ఎలా చంపాడంటే?
హైదరాబాద్ లోని సరూర్ నగర్ అప్సర హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పూజారి అయిన సాయికృష్ణ పక్కా ప్లాన్ ప్రకారమే అప్సరను ట్రాప్ చేసి తన కారులో తీసుకెళ్లాడు(Apsara’s Murder Case). అయితే ఆ యువతి మాత్రం తాను కోయంబత్తూరు వెళ్తున్నట్టు తల్లికి చెప్పింది. ఈ క్రమంలో ఫోర్డు కారులో వెళ్తున్న క్రమంలో శంషాబాద్ దాటగానే రాళ్లగూడ వైపు కారు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి భోజనం కూడా చేశారు. అనంతరం అప్సర కారులోని ఫ్రంట్ సీటులో కూర్చుని రిలాక్స్ అవుతుంది. ఇంతలో మెల్లిగా నిద్రలోకి జారుకుంది.
Hyderabad: అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్..గతంలో యువతికి ప్రెగ్నెన్సీ..అందుకే హత్య!
ఇక ఇదే అదునుగా భావించిన పూజారి సాయికృష్ణ(sai krsihna) తన వెంట తెచ్చుకున్న బెల్లం దంచే దుడ్డు కర్రతో తలపై దాడి చేసి చంపేశాడు. ఆ తరువాత అప్సర డెడ్ బాడీని(Apsara’s Murder Case) అదే కారులో ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆరోజు మొత్తం పార్కింగ్ లో ఉన్న కారులో డెడ్ బాడీ ఉంచాడు. ఆ మరుసటి రోజు సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్ లో అప్సర మృతదేహాన్ని(Apsara’s) సాయి పడేశాడు. అయితే తన కూతురు కనిపించడం లేదని అప్సర తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులకుఆ సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని ప్రశ్నించగా పోలీసులకు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి.
అప్సర ,సాయికృష్ణకి ఏమని ఒత్తిడి చేసింది…?
తన మేనకోడలు అప్సర కనిపించడం లేదంటూ మేనమామ వెంకట సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్సర కోసం గాలిస్తున్న పోలీసులు.. సాయికృష్ణ-అప్సర ల కాల్ డేటా ఆధారంగా.. సాయికృష్ణే అప్సరను మాయం చేశాడని నిర్థారణకు వచ్చారు.కాగా.. జూన్ 3వ తేదీన అప్సరను ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు తానే కారెక్కించినట్లు సాయికృష్ణ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. స్నేహితులతో భద్రాచలం వెళ్తానన్న అప్సర ఆ తర్వాత మిస్సైందని తెలిపాడు. జూన్ 5వ తేదీన సాయికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాయికృష్ణపై అనుమానంతో అతని ఇల్లు, పనిచేసే ఆలయం వద్ద సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అతను చెప్పేవాటికి, చేసే పనులకు సంబంధం లేకపోవడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు చెబుతున్న వివరాలను బట్టి.. సాయికృష్ణ – అప్సర కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతోనే అతను అప్సరను బండరాయితో మోది చంపి, మ్యాన్ హోల్ లో పడేశాడు. కాగా.. సాయికృష్ణను ఇప్పటికే పెళ్లై నాలుగేళ్ల కూతురు కూడా ఉంది.
సాయికృష్ణ తండ్రి ఏమి అన్నారు..?
సాయికృష్ణ అప్సరను హత్య చేయడంపై.. అతని తండ్రి స్పందించారు. ఆ అమ్మాయి ఎవరో తమకు తెలియదని, కంప్లైంటి ఇచ్చేటపుడు మేనకోడలు అని ఎందుకు చెప్పాడో తమకు తెలీదన్నారు. అప్సరను అప్పుడపుడు గుడిలో మాత్రమే చూశానని, ఆమెకు మానసిక సమస్యలు ఏవో ఉన్నట్లు తెలిసిందన్నారు. అప్సర తమ చుట్టం కాదని స్పష్టం చేశారు. బహుశా వాళ్లిద్దరూ స్నేహితులై ఉండొచ్చన్నారు. ఆమె చెన్నై నుంచి వచ్చిందన్నారు. తన కొడుకు ఆమెను చంపేందుకు ప్రేరేపించిన అంశాలేంటో పోలీసులే తేల్చాలన్నారు. ఏదేమైనా ఒక అమ్మాయిని చంపడం నేరమేనన్న ఆయన.. చట్టం ఏ శిక్ష విధించినా అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. కాగా.. సాయికృష్ణ కుటుంబం నివాసం ఉంటున్న కాలనీలో అప్సర కూడా ఉంటున్నట్లు తెలుస్తోంది.