Manish Sisodia: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా (Manish Sisodia) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
Manish Sisodia: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా (Manish Sisodia) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన కస్టడీ నేటితో ముగియడంతో ఢిల్లీ పోలీసులు (Delhi police) కోర్టులో హాజరుపరిచారు. దీంతో సిసోడియా కస్టడీని మరోసారి పొడిగించింది. జూన్ 1వరకు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో కోర్టు నుంచి బయటకు వచ్చిన సిసోడియాకు చేధు అనుభవం ఎదురయింది. పోలీసులు మనీశ్ సిసోడియా మెడ పట్టి లాక్కెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
అయితే కోర్చులో విచారణ అనంతరం మనీశ్ సిసోడియాను బయటకు తీసుకొస్తుండగా.. మీడియా చుట్టుముట్టింది. సిసోడియాను ప్రశ్నించేందుకు రిపోర్టర్లు ప్రయత్నించారు. ఈక్రమంలో ఆగ్రహానికి గురైన ఓ పోలీసు అధికారి మీడియా కెమెరాలను తోసేశారు. అలాగే సిసోడియా మెడ చుట్టూ చేయి వేసి లాక్కెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో షేర్ చేస్తూ భగ్గుమన్నారు. మనీశ్ సిసోడియా పట్ల ఇలా దురుసుగా ప్రవర్తించే అధికారం పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు. లేదంటే ఇలా చేయమని పోలీసులను
ఎవరైనా ఆదేశిస్తున్నారా అని నిలదీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా… ఆప్ నేతలు, కార్యకర్తలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.
क्या पुलिस को इस तरह मनीष जी के साथ दुर्व्यवहार करने का अधिकार है? क्या पुलिस को ऐसा करने के लिए ऊपर से कहा गया है? https://t.co/izPacU6SHI
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 23, 2023