మంగళవారం నుంచి ప్రారంభం
New Bues From Hyderabad : ఎకో ఫ్రెండ్లీ .. ఎలక్ట్రిక్ ఏసీ (Ac) బస్సు (Bus)లు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్(Hyderbad)-విజయవాడ (Vijayawada)మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) వాటిలో 10 బస్సులను మంగళవారం (Tuesdeay)నుంచి అందుబాటులోకి తెస్తోంది. మిగతా బస్సులు ఈ ఏడాది చివరినాటికి విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభూతిని కలిగించే ఈ బస్సులకు ఈ-గరుడ (E-Garuda)గా సంస్థ నామకరణం చేసింది. హైటెక్ (High Tec)హంగులతో ప్రయాణికులకు వీటిని అందుబాటులోకి తెచ్చామని, హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ (Electric) ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. రాబోయే రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. వాటిలో 1300 బస్సులను హైదరాబాద్(Hyderbad) సిటీలో, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. హైదరాబాద్ లో 10 డబుల్ డెక్కర్ (Duble Dekker)బస్సులను త్వరలోనే ప్రారంభిస్తామని వివరించింది.
కొత్త హంగులు…
హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 12 మీటర్ల పొడవైన ఈ బస్సు 41 సీట్ల సామర్థ్యం గలది. ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సైకర్యం, రీడింగ్ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. భద్రతా దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతోపాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ ఉంటుంది. వీటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తారు. బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలుంటాయి. నెల రోజుల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. ప్రయాణికులను లెక్కించడానికి ఆటోమేటిక్ ప్యాసింజర్ కౌంటర్ కెమెరా, బస్సురివర్స్ చేయడానికి రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల వరకు బస్సు ప్రయాణిస్తుందని టీఎస్ఆర్టీసీ పేర్కొంది.
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన #TSRTC.. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి వాడకంలోకి తెస్తోంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి… pic.twitter.com/Y5IAIu91jP
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) May 15, 2023