Naga Chitanya: పోలీస్ పాత్రలో నటిస్తున్న నాగచైతన్య
Naga Chaitanya Police Character Venkat Prabhu Film: నాగచైతన్య నటించిన లేటెస్ట్ లవ్ స్టోరీ ‘థాంక్యూ’. విక్రమ్ కె. కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. రాశీఖన్నా మళవికా నాయర్ అవికా గోర్ హీరోయిన్ లుగా నటించారు. ఓ యువకుడి జీవన ప్రయాణం నేపథ్యంలో సాగే విభిన్నమైన కథగా ఈ మూవీని రూపొందించారు.ఈ సినిమా తర్వాత నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్నాడు.
చైతన్య ‘థాంక్యూ’ మూవీ రిలీజ్ నేపథ్యంలో పలు మీడియాలతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు . ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చేయబోయే సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలని వెల్లడించాడు. ‘థాంక్యూ’ మూవీ తరువాత నాగచైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు.
ఈ మూవీలో తన పాత్ర ఎలా వుంటుంది అనే వివరాల్ని తాజాగా నాగచైతన్య వెల్లడించాడు.పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నానని నా స్టైల్లో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ అని వెల్లడించాడు. నాగచైతన్య పోలీస్ పాత్ర వేయడం ఇది రెండవసారి.’సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో చై మొదటిసారి కాప్ పాత్ర వేసాడు కానీ ఆ సినిమా ప్లాఫ్ అయింది…ఇప్పుడు మళ్ళీ చైతన్య ఇలాంటి పాత్ర ఎంచుకోవడం పై
అభిమానులు కొంచం అసహనం వ్యక్తం చేస్తున్నారు.