ఈ రోజు రాశిఫలాలను చూస్తే మిశ్రమ ఫలితాలతో ఉత్సాహంగా వుంటారు.మే 27-2023, శనివారం,రాశిఫలాలు
మేషరాశి
వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు. అనుకోని ఖర్చులు ఆదాయం తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణాలు వుంటాయి. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు.రాజకీయ వేత్తలకు కొంత నిరాశ. విద్యార్దులకు అనుకున్న అవకాశాలు తప్పిపోతాయి. ఆదిత్య హృదయం పఠించండి.
వృషభరాశి
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు స్థలాలు కొంటారు. రాబడి మరింతగా పెరుగుతుంది. అనుకున్న కాంట్రాక్టులు దక్కుతాయి. శ్రీ రామ స్తోత్రం పఠించండి.
మిథునరాశి
మిత్రులతో విరోధాలు. ఆదాయానికి మించి ఖర్చులు.శ్రమాధిక్యం తప్పదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు వుంటాయి. ఉదర సంబంధిత రుగ్మతలు. కాంట్రాక్టులు చేజారవచ్చు. వ్యాపారాలలో తొందరపాటు వద్దు. విద్యార్ధులకు కృషి పలించదు. గణపతికి అర్చన చేయించుకోండి.
కర్కాటక రాశి
నూతన కార్యక్రమాలకు శ్రీ కారం చుడుతారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గోంటారు. పాతబాకీలు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి. అంతా మంచే జరుగుతుంది.
సింహం రాశి
ఆకస్మిక ప్రయాణాలు.కొత్తగా రుణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య కుటుంబ సమస్యలు వస్తాయి. వివాదాలకు దూరంగా వుండండి. ఉదర సంబంధిత రుగ్మతలు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో చికాకులు తప్పవు. వెంకటేశ్వర స్వామిని పూజించండి.
కన్యా రాశి.
దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా వుంటుంది. కాంట్రాక్టులకు రావాల్సిన సొమ్ము అందుతుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు.పారిశ్రామిక వేత్తలకు విజయాలు అందుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
తుల రాశి
దూరపు బంధువులను కలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా వుంటాయి. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.
వృశ్చిక రాశి
ఆకస్మిక ప్రయాణాలు,ఆర్ధిక ఇబ్బందులు.బంధువర్గంతో విరోధాలు ఏర్పడుతాయి. ఆలోచనలు స్థిరంగా వుండవు. కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగ విధుల్లో ప్రతిబంధకాలు ఏర్పడుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి.
ధనస్సు రాశి
ఆదాయం కంటే ఖర్చు అధికంగా వుంటుంది. శ్రమాధిక్యంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శత్రువులు కొన్ని సమస్యలు సృష్టిస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు సాధాసీదాగ నడుస్తాయి. విద్యార్ధులకు కృషి ఫలించదు. గణేష్ స్తోత్రాలు పఠించండి.
మకర రాశి
కొత్త మిత్రుల కలయిక.ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్దిక పరిస్థితి మెరుగ్గా వుంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారా దిశకు చేరుకుంటాయి. నిరుద్యోగులకు ఇంటర్య్వూలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు వున్నత హోదాలు తథ్యం. వెంకటేశ్వర స్వామిని పూజించండి.
కుంభ రాశి
ఆకస్మిక ధనలాభం .రాబడి పెరుగుతుంది. కుటుంబ విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి విషయంలో చికాకులు తొలుగుతాయి. వ్యాపారులలో అనుకున్న లాభాలు దక్కుతాయి. విద్యార్ధుల అంచనాలు నిజమయ్యే సమయం. హనుమాన్ చాలీసా పఠించండి.
మీన రాశి
ఆర్ధిక లావాదేవీలు నిరూత్సాహ పరుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు చేజారవచ్చు. సోదరులతో ,మిత్రులతో కలహాలు.ఉద్యోగాల్లో మార్పులు వుండవచ్చు. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. ఆదిత్య హృదయం పఠించండి . అంతా మంచే జరుగుతుంది.