Waltair Veerayya: వీరయ్యకు పోటీగా మాస్ మహారాజా కుమ్మేశాడు
Mass Maharaja Raviteja Energy Super In Waltair Veerayya: మాస్ అంటే రవితేజ.. రవితేజ అంటే మాస్.. సినిమా ఎవరిదైనా.. పాత్ర ఏదైనా మాస్ మహారాజా దిగంత వరకే.. వన్స్ రవి స్టెప్ ఇన్.. ఎనర్జీ రీపీట్స్. కష్టపడి పైకి వచ్చినవారిలో చిరు తరువాత చెప్పుకోదగ్గ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ మొదటి స్థానంలో ఉంటాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా.. ఇప్పుడు మాస్ మహారాజాగా నిలబడ్డాడు. ఇక 2000 వ సంవత్సరంలో అన్నయ్య సినిమాలో చిరుకు తమ్ముడిగా రవితేజ నటించాడు. అప్పట్లో ఆ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాదాపు 23 ఏళ్ళ తరువాత రవితేజ.. మరోసారి చిరంజీవికి తమ్ముడిగా నటించాడు. ఈ చిత్రంలో చిరుకు పోటీగా పోలీసాఫీసర్ విక్రమ్ సాగర్ పాత్రలో రవి ఎనర్జీ లెవల్స్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. తన పవర్ ఫుల్ పాత్రలో అంతే పవర్ ఫుల్ గా రవితేజ ది గ్రేట్ అనిపించుకున్నాడు.
మామూలుగానే రవితేజ ఒక యాటిట్యూడ్ ను మెయింటైన్ చేస్తాడు. అదే యాటిట్యూడ్ ను ఈ సినిమాలో చూపించి షేక్.. షేక్ ఆడించాడు. చిరుకు తగ్గట్టు మాస్ డైలాగ్స్, మాస్ స్టెప్స్.. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు. ఈ చిత్రం రవితేజ కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలుస్తోంది అనడం లో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు అభిమానులు. అసలు వాల్తేరు వీరయ్య మీద ఇన్ని అంచనాలు పెట్టుకోవడానికి అభిమానులకు ఉన్న కారణాల్లో ఒకటి రవితేజ.. ఆ అంచనాలను రవితేజ కిందకు దించలేదు. తన పాత్ర ఉన్నంత సేపు ఫుల్ ఎనర్జీ నింపి ఈ మాస్ ట్రీట్ మెగా ఫ్యాన్స్ కే కాదు సాధారణ ఆడియన్స్ ని కూడా అదుర్స్ అనిపించేలా చేశాడు. ఇక ఈ మెగా- మాస్ కాంబో సంక్రాంతి రేసులో స్పెషల్ గా మారిపోయింది.