ఇక్కడ కనిపిస్తున్న పండుని ఎప్పుడైనా చూసారేమో గుర్తుకు తెచ్చుకోండి.
Mangoes: వేసవిలో మామిడి పండ్లు (Mangoes) ఇంట్లో అధికంగా దొరుకుతాయి. మామిడిపండ్ల గుజ్జుతో (Mango) పిల్లలకు ఇష్టమైన కప్ కేక్స్ (Cup Cakes) తయారు చేయొచ్చు. వీటిని చేయడం కూడా చాలా సులువు. మామిడిపండ్ల ఫ్లేవర్ (Mango Flavour) ఈ కప్ కేకులకు (Muffins) కూడా వస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
మామిడిపండు – ఒకటి
ఉప్మా రవ్వ – ఒక కప్పు
పంచదార – అరకప్పు
పాలు – అరకప్పు
పెరుగు – అరకప్పు
నూనె – పావు కప్పు
కస్టర్డ్ పౌడర్ – ఒక స్పూను
బేకింగ్ పౌడర్ – అర స్పూను
ఉప్పు – చిటికెడు
వంటసోడా – పావు స్పూను
తయారు చేసే విధానం
1. ఉప్మా రవ్వను మిక్సీ జార్ లో వేసి పొడిలా చేసుకుని ఒక గిన్నెలో వేయాలి.
2. అదే మిక్సీ జార్లో పంచదార, నూనె, పెరుగు కూడా వేసి మిక్సీ చేయాలి. తర్వాత `మరగకాచిన పాలు కూడా వేసి మిక్సీ పట్టాలి.
3. ఈ మిశ్రమాన్ని రవ్వ ఉన్న గిన్నెలో వేయాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
4. దీనిపై మూత పెట్టి ఓ పది నిమిషాలు మ్యారినేట్ కానివ్వాలి.
5. ఇప్పుడు కప్ కేక్స్ చేసే కేక్ మౌల్డ్లు లేదా చిన్న కూరగిన్నెల్లో అడుగున నెయ్యి లేదా నూనె రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేయాలి.
6. ఓవెన్ లేనివారు ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి.
7. దానిలో ఒక స్టాండ్ పెట్టి లేదా ఇసుక పోసి మూత పెట్టి పది నిమిషాలు ప్రీహీట్ చేయాలి.
8. ఇప్పుడు కేకు మిశ్రమంలో బేకింగ్ పౌడర్, వంటసోడా, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే పాలు పోయొచ్చు.
9. ఇప్పుడు కేక్ మౌల్డ్స్ లేదా చిన్న గిన్నెలో ముప్పావు వంతు వరకు ఈ మిశ్రమాన్ని వేయాలి.
10. వాటిపై డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి.
11. ఈ గిన్నెలను ప్రిహీట్ చేసిన కళాయిలోని స్టాండ్ పై పెట్టుకోవాలి.
12. తర్వాత మూత పెట్టి 25 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే మ్యాంగో కప్ కేక్స్ రెడీ అయినట్టే.