పురుషుల్లో కొందరికి రొమ్ములు పెరగడం సంభవిస్తుంది. ఇది తేలికగా తీసుకోకూడదు
[2:22 pm, 26/05/2023] Hariths: Leftover Food: ప్రతి ఇంట్లో మధ్యాహ్నం (Afternoon) లేదా రాత్రి వండిన ఆహారంలో (Food) ఎంతో కొంత మిగిలిపోతుంది. దానిని పడేయడానికి ఎక్కువ మందికి చేతులు రావు. ఆ ఆహారాన్ని (Eating food) మళ్లీ తిందామని దాచిపెట్టుకుంటారు. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని (Leftover Food) దాచుకొని తినడంలో ఎలాంటి తప్పులేదు కాకపోతే అది ఏ సమయంలో తింటున్నారు అన్నదే కాస్త పట్టించుకోవాల్సిన విషయం. మిగిలిపోయిన ఆహారాన్ని ఎన్ని గంటల్లోపు తినాలో ఆయుర్వేదం (Ayurvedam) వివరిస్తుంది. ఆ ఆహారం తాజాదనం, రుచి మారిపోక ముందే వాటిని తినేయాలని చెబుతోంది. ఆయుర్వేదం తాజాదనం తగ్గిపోతే అది పాత ఆహారం కిందకి వస్తుందని, అనారోగ్యాలకి కారణమవుతుందని వివరిస్తోంది ఆయుర్వేదం. అంతేకాదు… కాలం గడుస్తున్న కొద్ది ఆహారం రుచి కూడా మారిపోతుందని చెబుతోంది ఆయుర్వేదం.
ఆయుర్వేదం ప్రకారం వండిన ఆహారాన్ని మూడు గంటల్లోపు తినడం వల్ల పోషకాలు అధికంగా శరీరానికి చేరుతాయి. ఆ తర్వాత తినడం వల్ల పోషక విలువలు ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది. ఇక మిగిలిపోయిన ఆహారాన్ని కేవలం 24 గంటల్లోపు తిరిగి తినాలి. 24 గంటలు దాటిన తర్వాత ఆ ఆహారాన్ని తినకపోవడం అన్ని విధాలా మంచిది. ఆ సమయం దాటితే ఆ ఆహారంలో బ్యాక్టీరియా ఉత్పన్నమవుతుంది. అది అభివృద్ధి చెందడం మొదలవుతుంది. కాబట్టి ఆ ఆహారాన్ని మీరు మళ్ళీ వేడి చేసినా కూడా బ్యాక్టీరియా పోయే అవకాశం ఉండదు. అలాంటి ఆహారాన్ని తింటే ఉబ్బరం, అజీర్తి రావచ్చు. శరీరంలో అనేక దోషాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి 24 గంటలు దాటి నిల్వ ఉంచిన ఆహారాన్ని తినకపోవడం అన్ని విధాలా మంచిది. లేకుంటే పేగు అనారోగ్యాలు వచ్చే ఛాన్సులు అధికం.
ఏ ఆహారాన్ని అయినా పదేపదే వేడి చేయడం వల్ల వాటిలోని పోషక విలువలు తగ్గిపోతాయి. వండిన ఆహారాన్ని మూడు గంటల్లోపు తింటే వాటిలోని పోషకాలు అన్ని శరీరానికి అందుతాయి. వండిన ఆహారాన్ని గంటన్నరలోగా తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మూడు గంటల తర్వాత తింటే రుచి కాస్త తగ్గుతుంది. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసేవారు ఆహారం వేడిగా ఉన్నప్పుడు ఫ్రిజ్లో పెట్టకూడదు. పూర్తిగా చల్లారాకే పెట్టాలి. మాంసం, పాలతో చేసిన వంటకాలు, సముద్రపు ఆహారాన్ని నిల్వ చేయకపోవడమే మంచిది. వాటిని నిల్వ చేస్తే త్వరగా బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. తాజా ఆహారం ఇచ్చే ఆరోగ్యం ఏ ఆహారమూ శరీరానికి ఇవ్వదు.
[2:25 pm, 26/05/2023] Hariths: Enlargement of breasts in men can be the cause of that harmful disease
Male Breasts, Enlargement of breasts, Fatty liver, Liver and Breasts, పురుషుల్లో రొమ్ములు, లివర్, కాలేయ వ్యాధులు
Male Breasts: పురుషుల్లో రొమ్ముల పెరుగుదల ఆ హానికర జబ్బుకు కారణం కావచ్చు
పురుషుల్లో కొందరికి రొమ్ములు పెరగడం సంభవిస్తుంది. ఇది తేలికగా తీసుకోకూడదు.
Male Breasts: బొద్దుగా ఉండే పురుషుల్లో రొమ్ములు (Male Breasts:) పెరిగినట్టు కనిపిస్తాయి. కొంతమందికి నిజంగానే రొమ్ములు పెరిగే సమస్య (Enlargement of breasts) ఉండొచ్చు. ఈ రెండిటికీ తేడా తెలుసుకోవాలి. అకస్మాత్తుగా రొమ్ములు (Breast) పెరిగినట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను (Doctors) సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే మగవారిలో (Men) రొమ్ములు పెరగడం అనేది చాలా తీవ్రమైన కాలేయ సమస్యకు సంకేతం. చాలామందికి ఈ విషయంపై అవగాహన లేదు. సాధారణంగా ఉన్న రొమ్ములు కొన్ని నెలలు లేదా రోజుల్లో పెరిగినట్టు అనిపిస్తే దానికి కారణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాలేయ టెస్టులు (Liver Tests) చేయించుకోవాలి.
శరీరంలో జీవ ప్రక్రియను, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్ణయించేది కాలేయం. ఇది ప్రధాన భాగం. ఈ అవయవం దెబ్బతింటే శరీరం అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. మగవారిలో రొమ్ములు పెరగడం అనే దాన్ని‘ గైనకోమాస్టియా’ అంటారు. ఇది ఫ్యాటీ లివర్ వ్యాధికి సంబంధించినది.
ఈస్ట్రోజన్ అనేది స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించినది. ఇది సెక్స్ హార్మోన్. స్త్రీలలో అధికంగా ఉంటుంది. పురుషుల్లో చాలా తక్కువగా ఉంటుంది. స్త్రీలో రొమ్ములు పెరగడానికి ఈస్ట్రోజన్ కారణం. మగవారిలో కూడా రొమ్ములు పెరుగుతున్నాయంటే దానికి కారణం ఈస్ట్రోజన్ స్థాయిలు పెరగడమని అర్థం చేసుకోవాలి. ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడిన పురుషుల్లో అడ్రినల్ గ్రంధుల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి అధికమైనప్పుడు ఇలా రొమ్ములు పెరుగుతాయి. కాబట్టి ఛాతీ భాగం ఉబ్బినట్టు అనిపిస్తే వెంటనే కాలేయ వ్యాధి ఉందేమో చెక్ చేయించుకోవాలి.
శరీరంలో ఈస్ట్రోజన్ అధికంగా పేరుకుపోవడం వల్లే పురుషుల్లో రొమ్ములు పెరిగినట్టు కనిపిస్తాయి. కాలేయం అదనంగా ఉత్పన్నమైన ఈస్ట్రోజన్ ను విచ్ఛిన్నం చేస్తుంది. శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. ఎప్పుడైతే కాలేయం సరిగా పనిచేయలేదో అప్పుడు ఈస్ట్రోజన్ మగవారిలో పేరుకుపోయి వక్షోజాల రూపంలో కనిపిస్తుంది. అందుకే జాగ్రత్త పడాలి. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోయి ఈస్ట్రోజన్ పేరుకుపోవడం ఎక్కువైతే రొమ్ములు పెరగడం ప్రారంభం అవుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ బారిన పడినవారు వారిలో కాలేయంలో కొవ్వులు పేరుకు పోతాయి.
ఫ్యాటీ లివర్ డిసీస్ బారిన పడితే కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే…
పొట్టలో విపరీతమైన నొప్పి వస్తుంది. అది కూడా కాలేయం ఉండే కుడివైపే వస్తుంది. చాలా బలహీనంగా కనిపిస్తారు. చర్మం కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. చర్మం దురద పెడుతుంది. బరువు అకస్మాత్తుగా తగ్గిపోతారు. విపరీతమైన అలసట వేధిస్తుంది. పొట్ట, పాదాలు, కాళ్లల్లో వాపు కనిపిస్తుంది.